Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ శివ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'సూపర్ పవర్'. ఈ చిత్రం బుధవారం ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభమైంది. అతిథులుగా విచ్చేసిన సారిపల్లి కొండలరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ, 'గతంలో నేను 'పోలీస్ పవర్' చిత్రంలో హీరోగా నటించా. ఆ సినిమా నేను మాస్ హీరోగా నిలబడటానికి తోడ్పడింది. అదే స్ఫూర్తితో సొంత బ్యానర్‌లో 'మాస్ పవర్' చిత్రాన్ని నిర్మించాను. ఇందులో ఐదు ఫైట్స్ ఉంటాయి. ఈ సినిమాను జనవరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఇక ఈ తాజా చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం. ఎన్నో అడ్డంకులు అధిగమించి చివరకు సూపర్ పవర్ కప్‌ను హీరో ఎలా సొంతం చేసుకున్నాడన్నది కథాంశం. సినిమాలో పది ఫైట్స్ ఉంటాయి. పది మంది ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారు. నా గత చిత్రాలను ఆదరించినట్టు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.