Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ, 'మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఇదేనని భావిస్తున్నాను. హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. మంచి నిర్మాత దొరకడం వల్లనే ఈ సినిమా సాధ్యమైంది. ఇదొక ఎక్స్‌పెరిమెంట్ ప్రాజెక్ట్ అని చెప్పలేను కానీ.. ఎగ్జాంపులర్
ప్రాజెక్ట్ అవుతుందని చెప్పగలను. మా టీజర్‌కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. 20 మిలియన్ వ్యూస్ క్రాస్ అయ్యింది. అనుష్క చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటుంది. అనుష్క చేసిన సాక్షి అనే అమ్మాయి పాత్ర మాట్లాడలేదు. చెవులు వినపడవు.
తన యాంగిల్‌లో కథ రన్ అవుతుంది కాబట్టే ఈ సినిమాకి 'నిశ్శబ్దం' అనే టైటిల్‌ను పెట్టాం. ఈ సినిమాలో సుబ్బరాజు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పాత్రలో కనపడబోతున్నారు. 'నిన్నుకోరి' తర్వాత గోపీసుందర్ అంత గొప్ప ఆల్బమ్‌ను ఈ సినిమాకు ఇచ్చారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు హేమంత్‌కే దక్కుతుంది' అని చెప్పారు. 'నేను, హేమంత్ పదిహేనేళ్లుగా స్నేహితులం. ఈ కథని విన్నప్పుడు ఇందులో ఓ పాత్రను నాకు ఇస్తే బావుంటుంది కదా! అని అనుకున్నాను. ముందు
ఈ పాత్రకు యూనిట్ ఎవరిని అనుకున్నారో ఏమో కానీ.. సినిమా ప్రారంభానికి మూడు, నాలుగు నెలల ముందు నాకు ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది. వైరటీ క్యారెక్టర్ ఇచ్చిన హేమంత్‌కి, నిర్మాతలు విశ్వప్రసాద్, కోన వెంకట్‌గారికి థ్యాంక్స్' అని సుబ్బరాజు అన్నారు.
సహనిర్మాత మాట్లాడుతూ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ, 'ఇదొక మంచి సినిమా. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాం' అని చెప్పారు. ''నిన్నుకోరి' సినిమా నుండి కోన వెంకట్‌గారితో అనుబంధం ఉంది.
ఆ సినిమాకు లైన్ ప్రొడక్షన్‌లో వర్క్ చేశాం. హాలీవుడ్ రేంజ్‌లో ఓ సినిమా చేయాలని అనుకునేవాడిని. నేను ఇదే విషయాన్ని కోనవెంకట్‌గారితో కలిసి డిస్కస్ చేశాను. అలాంటి సినిమా ఇండియన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్‌తో సినిమా చేస్తే తీయాలని అనుకున్నాం. రెండేళ్ల క్రితం హేమంత్ దగ్గర లైన్ విని కథని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. హాలీవుడ్ స్టైల్‌లో ఉండే ఇండియన్ మూవీ ఇది. జనవరి 31న దీన్ని రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.
డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ, 'టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అనుష్కగారు మూడు నాలుగు నెలలు కష్టపడి సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్ నేర్చుకున్నారు. హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కూడా చక్కగా చేశారు. అంజలి ఇందులో టఫ్ కాప్ రోల్ చేశారు. సుబ్బరాజు కూడా వైరటీ పాత్రలో కనపడతారు. టెక్నికల్‌గా ఇదొక కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. అందరినీ ఇంప్రెస్ చేస్తుందని నమ్ముతున్నాను' అని దర్శకుడు హేమంత్ మధుకర్ అన్నారు.