Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం 'డిస్కోరాజా'. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈచిత్ర టీజర్ శుక్రవారం విడుదలైంది. 'సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో సాగే చిత్రమిది. ఎంతో శ్రమతో, హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో ఐర్లాండ్ తదితర ప్రాంతాల్లో తీసిన విజువల్స్‌తో టీజర్ రూపొందించాం. అలానే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ల్యాబ్ సెట్‌లో తీసిన షాట్స్ కూడా టీజర్‌లో ఉపయోగించాం. ఇక మాస్ మహారాజ రవితేజ ఫాన్స్ కోరుకునే విధంగా ఈ సినిమాలో ఉన్న అయన రెట్రో గెెటప్ పై ఉన్న యాక్షన్ షాట్స్‌తో ఈ టీజర్‌ని ఎండ్ చేశాం' అని దర్శకుడు వి.ఐ.ఆనంద్ చెప్పారు. టీజర్ స్టార్టింగ్‌లో రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడం ఖాయం. రవితేజ ఫాన్స్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఈచిత్రం ఉంటుంది. జనవరి 24న భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు. రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ :సాయి రిషిక, నిర్మాత : రజిని తళ్లూరి, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్ : అబ్బూరి రవి, మ్యూజిక్ : థమన్. ఎస్, ఎడిటర్ : నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్