Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్, శైలజ జంటగా జి.మురళి దర్శకత్వంలో వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకంపై పి.వీరారెడ్డి నిర్మించిన చిత్రం 'మేరా దోస్త్'. శుక్రవారం సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత పి.వీరారెడ్డి మాట్లాడుతూ,
'మేం ఏ టార్గెట్‌తో సినిమాను నిర్మించామో ఆ టార్గెట్ రీచ్ అయ్యాం. థియేటర్స్‌లో పాటలకు, ఫైట్స్‌కు, ఫ్రెండ్‌షిప్ వ్యాల్యూస్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఒక మంచి సినిమా తీశామన్న ఆనందంతో థియేటర్ నుంచి బయటకొచ్చాం. ఇంకా మా సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. థియేటర్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం' అని అన్నారు. 'ఉషా మయూరి థియేటర్‌ని సందర్శించాం. ఆడియెన్స్ ఫుల్‌గా ఎంజారు చేస్తున్నారు. విడుదలైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా సినిమాను ఇంత మంచి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్' అని దర్శకుడు జి.మురళి చెప్పారు.
హీరోయిన్ శైలజ మాట్లాడుతూ, ' సినిమాకి ఊహించని స్పందన లభిస్తుంది. ముఖ్యంగా సాంగ్స్, లవ్ సీన్స్, సెంటిమెంట్‌కి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగుంది. మున్ముందు ఈ సినిమా మరింత పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం' అని తెలిపారు.