Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హైదరాబాద్‌ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నాం. మన నగరం పచ్చగా ఉండాలంటే హరిత హారం నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. కాదంబరి కిరణ్ 'మనంసైతం' ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు నా అభినందనలు. చిత్రపురి కాలనీలో ఏ సమస్య వచ్చినా తీర్చేందుకు నా వంతు సహకారం అందిస్తా' అని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ తన 'మనం సైతం' సంస్థ ఆధ్వర్యంలో మెడీకవర్ ఆస్పత్రితో కలిసి శనివారం చిత్రపురి కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేద కళాకారులు దివ్యాంగుడైన మేనేజర్ ప్రవీణ్ కుమార్‌కు రూ.25 వేలు, నటుడు మల్లేశంకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అతిథిగా విచ్చేసిన నగర మేయర్ బొంతు రామ్మోహన్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. పలువురు కార్మికులకు దోమ తెరలు, దుప్పట్లు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, 'భావి తరాలకు మనమిచ్చే నిజమైన సంపద చెట్లే. కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో సంతోష్ కుమార్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మా వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాం. మనం సైతం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దినేష్, పీవీ శ్రీనివాస్, ఎన్ శంకర్, దీప్తి వాజ్ పారు తదితరులు పాల్గొన్నారు.