Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల తెలుగులో 'గద్దల కొండ గణేష్', హిందీలో 'హౌస్‌ఫుల్ 4'తో వరుస విజయాలు అందుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తోంది. తాజాగా బాలీవుడ్‌లో మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌లకి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. 'హౌస్‌ఫుల్ 4' నిర్మాత సాజిద్ నడియడ్‌వాలా నిర్మించబోతున్న ఓ భారీ చిత్రంలో కథానాయికగా ఫైనల్ అయ్యింది. దీంతోపాటు మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో కూడా పూజాని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ఈ నేపథ్యంలో జీవితంలో చేసే సాహసాల గురించి పూజా చెబుతూ, 'కెరీర్ పరంగా సాహసాలు చేసినప్పుడు మనకు డెవలప్‌మెంట్ ఉంటుంది. అవి మనల్ని ప్రత్యేక స్థానంలో నిలబెడతాయి. కంఫర్ట్ జోన్‌లో బతకడంలో తప్పులేదు. కానీ పది మందిలో మనకంటూ ఓ స్థానం ఉండాలంటే కచ్చితంగా డిఫరెంట్‌గా చేయాలి' అని పూజా తెలిపింది.