Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డాన్సులు, ఫైట్స్, కామెడీ అంశాలకు పెద్ద పీట వేస్తూ మాస్ ఆడియెన్స్‌ని టార్గెట్‌గా చేసిన కమర్షియల్ చిత్రం '90ఎంఎల్'. అనుకున్న ఆడియెన్స్‌కి సినిమా రీచ్ కావడంలో మేం సక్సెస్ అయ్యాం' అని అంటున్నారు హీరో కార్తికేయ. శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రూపొందిన చిత్రం '90ఎంఎల్'. శుక్రవారం విడుదలైన నేపథ్యంలో శనివారం కార్తికేయ మీడియాతో మాట్లాడారు.
- శేఖర్ రెడ్డి ఈ కథ చెప్పినప్పుడు నవ్వుకున్నా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అనిపించింది. కొత్తగా ఉంది, కచ్చితంగా ఆడియెన్స్ కొత్తగా ఫీల్ అవుతారనుకున్నా.
- 'ఆర్ ఎక్స్ 100' తర్వాత దేనికదే భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. కార్తికేయ ఏదైనా చేయగలడనే ఫీలింగ్ దర్శక, నిర్మాతలు,
అభిమానుల్లో కలిగించే ఉద్దేశంతో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా.
ఈ సినిమా ఓకే చేసినప్పుడు మాత్రమే కాదు చిత్రీకరణ సమయంలోనూ కొన్ని విమర్శలు వస్తాయని తెలుసు. 'వీడేంటి అప్పుడే మాస్ హీరో అనుకుంటున్నాడా' అని ప్రేక్షకులు అంటారనే భయం కూడా ఉండేది.
- మేం కేవలం మాస్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసుకుని సినిమా తీశాం. శుక్రవారం కొన్ని థియేటర్స్‌కి వెళ్ళాను. మాస్ ఆడియెన్స్ బాగా ఎంజారు చేస్తున్నారు. కొన్ని విమర్శలున్నప్పటికీ మేం అనుకున్న టార్గెట్ రీచ్ కావడంలో సక్సెస్ అయ్యామనే నమ్ముతున్నా. సినిమాకి మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా నా నటన గురించి ప్రశంసిస్తున్నారు. డాన్సులు, ఫైట్స్, కామెడీ బాగా చేశాడని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. బేసిక్‌గా నాకు డాన్సులంటే ఇష్టం. చిన్నప్పుడు చిరంజీవి డాన్సులు చూసి పెరిగిన వాడిని. 'ఇంద్ర'లో ఆయన వేసిన వీణ సాంగ్‌ని స్కూల్, కాలేజ్ ఫంక్షన్స్‌లో వేసేవాడిని. నా గత చిత్రాల్లో డాన్సులు వేసే అవకాశం రాలేదు. ఇందులో ఆ స్కోప్ ఉండటంతో బాగా చేసేందుకు ప్రయత్నించా.
- అలాగే చిరంజీవి, రజనీకాంత్, రవితేజ, మహేష్‌బాబు వంటి వారు కామెడీ చేస్తుంటే బాగా ఎంజారు చేసేవాళ్ళం. అలా నేనూ చేయాలని ఉండేది. ఇందులో నా కామెడీ టైమింగ్‌కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఎమోషనల్ సీన్స్‌లో తొలి చిత్రం నుంచి నటించే అవకాశం ఉంది. అందుకే ఆ విషయంలో కాస్త మెచ్యూర్ అయ్యాను.
- ఇటీవల 'దిశ' ఘటనకి నేను నటించిన 'గుణ' క్లైమాక్స్ వీడియో షేర్ చేయడం బాధగా ఉంది. అలాంటి ఘటనలు చూసి కోపం, బాధ కలగడం తప్ప నేను ఏం చేయలేకపోతున్నానే నిస్సహాయత ఉంది. ఇక ఇప్పటికీ 'ఆర్‌ఎక్స్ 100' ప్రభావం నాపై ఉందంటున్నారు. ఆ సినిమా చేయడం వల్లే ఇక్కడి వరకు వచ్చా. మిగిలిన సినిమాల ద్వారా నేర్చుకుంటున్నా. మళ్లీ అలాంటి సినిమా ఒకటి తగిలితే కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కుతాను.
- సాధ్యమైనంత వరకు భిన్నమైన జోనర్ సినిమాలు చేయాలనుకుంటున్నా. నెక్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఒకటి, అలాగే భిన్నమైన లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నా. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. నటించడమనేది నా డ్రీమ్. ఎలాంటి పాత్రైనా చేస్తా. విలన్ పాత్రలే కాదు, డిజిటిల్, షార్ట్ ఫిల్మ్ అయినా చేసేందుకు రెడీగా ఉన్నా.