Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణ లో జీఏ2, యూవీ క్రియేషన్స్ పతాకా లపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం 'ప్రతి రోజూ పండగే'. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'చిన్నతనమే..' అంటూ సాగే పాటని తాజాగా విడుదల చేశారు. 'సీతారామశాస్త్రి రాసిన ఈ పాటని థమన్ అంతేబాగా కంపోజ్ చేశారు. విడుదలైన పాట శ్రోతలని మెప్పిస్తుంది. తాతా, మనవడి మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఈ పాట ఉంది. ప్రేక్షక హృదయాలను హత్తుకుంటుంది. ఇక ఇందులో సాయితేజ్ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్‌లో సాయితేజ్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నాడు. హోమం చేస్తుండగా వచ్చే పోరాట ఘట్టాల్లో షర్ట్ లేకుండా సాయితేజ్ కనిపించే లుక్ ఆద్యంతం ఆకట్టుకుం టుంది. ఫిట్‌నెస్ ట్రైనర్ సాయంతో సాయితేజ్ సిక్స్‌ప్యాక్‌ని పొందారు. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 20న సినిమాని గ్రాండ్‌గా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని చిత్ర బృందం తెలిపింది.