Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనాక్షి సిన్హా ఇటీవల 'దబాంగ్ 3'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత చిత్రాల మాదిరిగానే రజ్జో పాత్రలో వినోదాన్ని పంచారు. సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. బబ్లీ పాత్రలతోపాటు అవకాశం వచ్చినప్పుడల్లా యాక్షన్ తరహా పాత్రలతో మెప్పించే ప్రయత్నంలో సోనాక్షి చాలా వరకు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. 'అకిరా', 'ఫోర్స్ 2' వంటి చిత్రాల్లో తనదైన యాక్షన్‌తో ఆకట్టుకున్న సోనాక్షి తాజాగా మరో యాక్షన్ చిత్రంలో నటించనుంది. లేటెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ క్లూని 2016లో నటించిన 'ఫోర్స్ 2'లోని యాక్షన్ క్లిప్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. 'నేను చేసిన అత్యంత మొమరబుల్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. అలాగేజాన్ అబ్రహాంతో నటించిన బెస్ట్ యాక్షన్ సీన్ కూడా ఇదే. మళ్ళీ యాక్షన్‌లోకి రావడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా' అని తెలిపింది. సోనాక్షి ప్రస్తుతం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'లో నటిస్తున్నారు. అజరు దేవగన్, సంజరుదత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.