Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'భీష్మ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని సంక్రాంతి కానుకగా ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, 'రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా, పూర్తి వినోదాత్మకంగా సినిమాని రూపొందిస్తున్నాం. అందుకు టీజరే నిదర్శనం. టీజర్ కేవలం శాంపిల్ మాత్రమే, దానికి తగినట్టుగానే కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు కొత్తగా ఉంటాయి' అని చెప్పారు. 'ప్రతి అబ్బాయి నితిన్ పాత్రకి కనెక్ట్ అయితే, ప్రతి అమ్మాయి రష్మిక పాత్రకి ఆకర్షితులవుతారు. అంత బాగా పాత్రలను దర్శకుడు వెంకీ కుడుముల డిజైన్ చేశారు. తాజాగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. నితిన్, రష్మిక మందన్నా, నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, ఎడిటర్ : నవీన్ నూలి.