Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'అల.. వైకుంఠపురములో' చిత్ర థ్యాంక్స్ మీట్‌లో దర్శక,నిర్మాతలు
'డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రం గారికి థాంక్స్. ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్. ఇది మా కలయికలో ఒక కామా మాత్రమే..'' అని అల్లు అర్జున్ చెప్పారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈనెల 12న విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాక ష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు దూసుకుపోతున్న సందర్భంగా సోమవారం చిత్ర బందం థాంక్యూ మీట్‌ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'ఈ సినిమాతో ఎంటర్‌టైన్ చెయ్యగలిగే అదష్టం ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కతజ్ఞతలు. చెప్పి మరీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ.. ఇది నాకు చాలా ఇష్టమైన త్రివిక్రమ్ గారి డైలాగ్. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీ లవ్ నాకు అందింది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌తో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఆయనతో కలిసి చాలా సినిమాలు చెయ్యబోతున్నా. నార్త్ ఇండియాలో నేను చేసే ఫైట్లు ఇష్టపడతారు. నాకొచ్చిన యాక్షన్ ఇమేజ్‌కు కారణం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్. వినోద్ సినిమాటోగ్రఫీ లేకపోతే సినిమాకు ఈ రేంజ్ ఉండేది కాదు. తమన్ మ్యూజిక్‌ని చాలా ఇష్టపడే ప్రేక్షకుడ్ని నేను. 'జులాయి'తో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ మొదలైంది. ఆ తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' చేశాను. పూజతో 'డీజే' చేసేప్పుడు ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోంది, ఇంకో సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నా. బేసిగ్గా ఒక హీరోయిన్ని రిపీట్ చెయ్యాలంటే కొంచెం భయపడతాను. ఎప్పట్నించో ఒక పెద్ద సినిమా పడాలనేది నా కోరిక. దాన్ని క్రియేట్ చేసేదెవరు అనుకుంటూ వచ్చాను. ఒక లార్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్క త్రివిక్రమ్ గారే మైండ్‌లోకి వచ్చారు. స్క్రిప్ట్ ఈజ్ ద కింగ్ అనే విషయంలో మరో మాట లేదు. ఆయన మైండ్‌సెట్ ఎలా ఉందో తెలుసుకుందామని కలిశాను. జెన్యూన్‌గా, సరదాగా ఒక సినిమా చేద్దామనుకున్నాం. ఆ జెన్యూనిటీకి జనం కనెక్టయ్యారు. నేను ఎన్నిసార్లు డీవియేట్ అయినా ఆయన ధైర్యమిస్తూ వచ్చారు. డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మా కుటుంబం కూడా సినిమాకి మా జీవితాల్ని అంకితం చేసింది. మా తాత చేశారు, మా నాన్న చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నా. దీన్ని నెపోటిజం అనుకుంటే అనుకోండి. మేం ప్రజలకు వినోదాన్ని పంచడానికి సరెండర్ అయ్యాం' అని చెప్పారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 'జీవితంలో మేం జంధ్యాల గారిని కోల్పోతే, భగవంతుడు మాకిచ్చిన మరో వరం త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా సంథింగ్ స్పెషల్. ఇది మ్యూజికల్ హిట్. మా స్నేహితుడైన డ్రమ్స్ శివకుమార్ కొడుకు తమన్ ఇంత క్లాసీ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు నేనే చాలా గర్వపడుతున్నా. ఇది నా జీవితంలో అతిపెద్ద పండగ' అని తెలిపారు. ''నిజంగా ఈ జర్నీలో చాలా చాలా నేర్చుకున్నా. బన్నీ కెరీర్‌లోని బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో ఇదొకటి. 'బుట్టబొమ్మ' అనే దానికి పూజ సరిగ్గా సరిపోయింది. ఈ సినిమా నాకిచ్చిన ఎనర్జీతో ఈ నెలాఖరుకి ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నా' అని సుశాంత్ అన్నారు. తమన్ మాట్లాడుతూ, 'త్రివిక్రమ్ గారి రైటింగ్‌ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా విషయంలో నాపై చాలా బాధ్యతలున్నాయనిపించింది. బన్నీ గ్రేట్ డాన్సర్. అతనితో తొలిసారి 'రేసుగుర్రం'కు పనిచేశాను. లావుగా ఉన్న నన్ను పరిగెత్తించి గెలిపించింది. ఈ సినిమా నిజంగా గెలిచింది'' అని తెలిపారు. ''ఈ సినిమాతో త్రివిక్రమ్ గారికి పెద్ద ఫ్యాన్ అయ్యాను. తమన్‌కి గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. రామ్-లక్ష్మణ్ ప్రతి సినిమాకీ కొత్తగా ఫైట్లు ఇస్తుంటారు. అల్ల్లు అర్జున్‌తో నన్ను రిపీట్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. 'డీజే' చేసినప్పట్నుంచీ బన్నీకి అభిమానినయ్యాను' అని కథానాయిక పూజా హెగ్డే అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'మా కుటుంబం ఇద్దరికి కతజ్ఞతలు చెప్పుకోవాలి. తెలుగు కళామతల్లికి ఒక రూపమిస్తే, ఆమె కాళ్లదగ్గర సేదతీర్చుకుంటున్న కుటుంబం మాది. అల్లు రామలింగయ్యగారి నుంచి మా అబ్బాయిల దాకా.. ఇన్నేళ్ల నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్న ప్రేక్షకులకు కతజ్ఞతలు. త్రివిక్రమ్ గారు మాకు కథ చెప్పినప్పుడు సింపుల్ కథే అనిపించింది. కానీ తన స్క్రీన్‌ప్లేతో గొప్పగా తీర్చిదిద్దారు. రషెస్ చూసి బన్నీ అలవోకగా ఆ క్యారెక్టర్ చేసిన విధానానికి ఆశ్చర్యపోయా. కలెక్షన్స్ పరంగా చూస్తే. బన్నీ బెస్ట్, త్రివిక్రం బెస్ట్ మాత్రమే కాదు.. ఇండిస్టీ బెస్ట్స్‌లో ఒకటవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను' అని చెప్పారు.
హర్షవర్ధన్, నవదీప్, రామ్ లక్ష్మణ్, బ్రహ్మానందం, సునీల్, తనికెళ్ళభరణి తదితరులు చిత్రం సాధించిన ఘన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సినిమాకు సంబంధించి రెండు విషయాలు దాచాను. 'సిత్తరాల సిరపడు' అనే శ్రీకాకుళం యాసతో నడిచే ఒక పాటని రామ్-లక్ష్మణ్ మాస్టర్లతో కొరియోగ్రఫీ చేయించాను. దానికి వాళ్లు ఫైట్ చెయ్యలేదు. అందులోని ప్రతి లిరిక్‌ని అర్థం చేసుకొని ఒక కవితలాగా దాన్ని తీశారు. ఆ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నాం. దాన్ని విజయకుమార్ రాస్తే, తమన్ మంచి ట్యూన్స్ కట్టాడు. అలాగే 'రాములో రాములా' పాటలో బ్రహ్మానందం గారిని ఉపయోగించుకున్నాం. మామీదున్న వాత్సల్యంతో ఆయన దాన్ని చేశారు. పూజ టైంకు వస్తుంది, క్యారెక్టర్‌ను బాగా అర్థం చేసుకుంటుంది, తెలివితేటలున్నాయి, అందంగా ఉంటుంది, అడిగినప్పుడు డేట్లిస్తుంది, ఈతరం అమ్మాయికి ప్రతినిధి కాబట్టే మళ్లీ రెండోసారి ఆమెను తీసుకున్నాను. చాలా విషయాలు సినిమాటోగ్రాఫర్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌కు వదిలేశా. ఎడిటర్ నవీన్ గ్రేట్ జాబ్ చేశాడు. తమన్ ఇది బాలేదంటే, ఇంకోటి రెడీ చేసేవాడు. అందుకే సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ, ఓ మైగాడ్ డాడీ, అల వైకుంఠపురములో, సిత్తరాల సిరపడు వంటి ఆరు బ్లాక్‌బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా హిట్టనే ఫీలింగ్‌ని క్రియేట్ చేసిన తొలి వ్యక్తి తమన్. మా అందరి పనినీ సగం తగ్గించేశాడు. చినబాబు, అల్లు అరవింద్‌ల కుటుంబ సభ్యుడ్ని నేను. మీరు కలగనండి.. మేము రియల్ చేస్తామన్నారు వాళ్లు. ఈ సినిమాకు మొదలు, చివర బన్నీనే. సినిమా చూడగానే ఒన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ టిల్ డేట్ అని బన్నీకి చెప్పాను. సచిన్‌కు ఫుల్ టాస్ వేస్తే ఏం జరుగుతుందో ఈ సినిమా బన్నీకి అంతే
- త్రివిక్రమ్