Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర థ్యాంక్స్ మీట్‌లో చిత్ర బృందం
'అల్లూరి సీతారామరాజు ట్రాక్ రాగానే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో నాకు గూజ్‌బంప్స్ వచ్చాయి. అలాగే 'మైండ్‌బ్లాక్' అనే సాంగ్‌ను దర్శకుడు చేయమన్నారు. ఇలా చేయడం నాకు కొత్తే. కానీ వారు ఏమనుకున్నారోకానీ.. ఇవాళ ఆ సాంగ్‌కు రియాక్షన్ చూసి నేనే నమ్మలేకపోతున్నాను. పాటకే ఎక్కువ రియాక్షన్ వచ్చింది. 20 ఏళ్ళ కెరీర్‌లో మైండ్‌బ్లాక్‌కు వచ్చిన అప్లాజ్ దేనికీ రాలేదు' అని మహేశ్‌బాబు అన్నారు. ఈనెల 11న విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విజయవంతమైన టాక్‌తో రన్ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో మహేశ్‌బాబు మాట్లాడుతూ,'నాన్నగారి అభిమానులు, నా అభిమానులు సంక్రాంతి పండగ 12వ తేదీనే ఇచ్చారు. నిర్మాతలు నిన్న మొదటిరోజే షేర్స్ గురించి మాట్లాడుకుంటుంటే మ్యాజిక్‌గా ఫీలయ్యాను. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీమ్ యుగంధర్, తమ్మిరాజు, శేఖర్‌మాస్టర్, నటీనటులు అందరికీ థ్యాంక్స్. నేను సహజంగా మొదటిరోజు పిల్లల్తో సినిమా చూస్తాను. అది నాకు సెంటిమెంట్. సినిమా చూశాక విజయశాంతిగారిని సాయంత్రం కలిశాను. ఆమె తప్ప ఎవ్వరూ ఆ పాత్ర ఎవ్వరూ చేయలేరు. రామ్‌లక్ష్మణ్‌లు బాగా నచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఆడియన్స్‌లా ఆలోచిస్తారు. అందుకే వాళ్ళకి కథంతా చెప్పమన్నాను. 'దూకుడు' తర్వాత 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి' ఇలా.. అన్ని మంచి చిత్రాలే చేశాను. సినిమా స్క్రిప్ట్‌కు మనం సరెండర్ అవ్వాలి. 'ఎఫ్2' చేస్తున్న టైంలో అనిల్ నాకు కథ చెప్పారు. ఆ టైంలో నేను మరో కమిట్‌మెంట్‌తో ఉన్నాను. తనూ 'ఎఫ్2'తో బిజీగా అయ్యాడు. 'ఎఫ్2' చూశాక వెంటనే ఈ కథ చేసేయాలనిపించింది. తను అప్పటికే స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాడు. రష్మిక బాగా నటించింది. నిన్నటి నుంచి నాకు జర్నీ కొత్తగా వుంది. నాన్నగారి అభిమానులుకానీ నా అభిమానులు కానీ నా పెర్‌ఫార్మెన్స్‌కు రియాక్ట్ అయిన విధానం చాలా బాగుంది. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు అనిల్‌దే. ఇక దేవీ మ్యూజిక్ చేస్తే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ చాలా ముఖ్యంగా. తను చాలా బాగా ఇచ్చాడు. అనిల్ సుంకరగారు 'దూకుడు' నుంచి పరిచయం. నాన్నగారంటే ఇష్టం. ఆయన మాటలకంటే బాడీ లాంగ్వేజ్ ఇష్టం. అలాగే దిల్‌రాజు, మాది హ్యాట్రిక్ కాంబినేషన్ ఇలాగే డబుల్ హ్యాట్రిక్ కొట్టాలి' అని చెప్పారు.
'ఈ కథలో ప్రొఫెసర్ పాత్రకు విజయశాంతి తప్ప మరో రీప్లేస్‌మెంట్ లేదు. ప్రీ క్లెయిమాక్స్‌లో ఇంపార్టెంట్ మేటర్‌ను అద్భుతంగా పండించారు. పోస్టర్‌లో బ్లాక్‌బస్టర్‌గా బాప్.. అని టాగ్ పెట్టారు. అలా ఎందుకు పెట్టామంటే.. ప్రతి సినిమాకూ బాగుంది, బ్లాక్‌బస్టర్ అనేది మామూలు మాటలు. నిన్నటినుంచి ఒకటే టాక్.. 'బొమ్మ దద్దరిల్లిపోయింది' అనే చెబుతున్నారు. అందుకే అలా పెట్టాం. సినిమాలో ఓపెనింగ్ సీన్ పేట్రియాటిజయంతోనూ, ఆ తర్వాత ట్రెయిన్ ఎపిసోడ్, తర్వాత కర్నూలు ఎపిసోడ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్, సెకండాప్‌లో విజయశాంతి ఎమోషన్స్, ప్రకాష్‌రాజ్‌తో మహేష్ పొలిటికల్ డైలాగ్స్ ఇవన్నీ సినిమాను బ్లాక్‌బస్టర్‌కా బాప్ అనేలా చేశాయి. సినిమా చూశాక ప్రేక్షకులు ఓన్ చేసుకుని మాట్లాడుతున్నారు.
ఇక మేనరిజం, టేక్‌బో, నెవర్ బిఫోర్ ఆఫ్టర్, కూజాలు చెంబులవుతాయి.. వంటివి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాను చూశాక 'బాహుబలి'లో శివుడ్ని మోసినట్లు.. మహేష్‌బాబు ఈ సినిమా మోశారు. నెక్ట్స్‌వీక్ దాన్ని ఎక్కడో పెడతారు. అలాగే ఈ సినిమాలో అజరు పాత్రలో అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ చేశాడు. అల్లూరి సీతారామరాజు పాత్ర తెలుగు చరిత్రలో గుర్తిండిపోయే పాత్ర. అది కథలో కలిసిపోయింది. అందులో ఆయన ప్రజల సైనికుడు. ఇక్కడ హీరో సైనికుడు. మహేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మార్నింగ్ షో తర్వాత అద్భుతం జరిగింది. ఆయన అభిమానులు, ప్రేక్షకుల మధ్య సినిమా చూస్తుంటే నేనేనా! సినిమా తీసింది అనిపించింది' అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అనిల్ సుంకర, దిల్‌రాజు పాల్గొని చిత్ర విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
'13 ఏండ్ల తర్వాత రీ ఎంట్రీ మంచి సినిమాతో చేయడం చాలా సంతోషంగా ఉంది. అనిల్‌గారికి థ్యాంక్స్. ఈ సినిమా చేయడం మంచి అనుభూతి. ముఖ్యంగా మహేష్‌తో పనిచేయడం... చిన్నప్పుడు నటించాను. మళ్లీ సూపర్‌స్టార్ అయ్యాక చేయడం చాలా గొప్పగా అనిపించింది. 'కొడుకు దిద్దిన కాపురం' పెద్ద హిట్. ఇప్పుడు 'సరిలేరు' అంతకంటే పెద్ద హిట్టు. నిన్న రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి అద్భుతంగా చేశారమ్మా.. ఏడిపించారమ్మా.. అంటూ మాట్లాడుతున్నారు. గతంలో 'ఒసేరు రాములమ్మ', 'ప్రతిఘటన', 'కర్తవ్యం'లో ఎంత బరువైన పాత్ర చేశానో అంతకంటే బరువైన పాత్ర ఈ సినిమాలో చేశాను.
క్లయిమాక్స్ సీన్‌లో పొద్దునే సీన్‌లో కూర్చున్నాక..
సాయంత్రం వరకు అలాగే కూర్చున్నా..
ఆ సీన్ చేస్తున్నంతసేపు తెలీని బాధ వచ్చేసింది.
సహజంగా గ్లిజరిన్ వాడతాను. కానీ ఆటోమేటిగ్గా ఏడుపు వచ్చేసింది. లీనమైపోయాను. సినిమా చూశాక ప్రతీ డైలాగ్ చెబుతున్నారంటే.. సినిమా ఎంత పెద్ద హిట్టో వేరే చెప్పక్కర్లేదు. జవాన్ల తల్లులు ఎంత త్యాగం చేస్తున్నారో ఈ సినిమా చూశాక అర్థమయింది. జవాన్లకు మదర్ ఇండియాలా ఈ సినిమా అయింది.
- విజయశాంతి