Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆడవాళ్ళకు సమ్మెలెందుకు? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 24,2020

ఆడవాళ్ళకు సమ్మెలెందుకు?

అవన్నీ మగవాళ్ళ యవ్వారాలు. ఆడవాళ్ళకు సమ్మెలెందుకు? ఇల్లు దిద్దుకునే ఆడదానికి, మొగుడికి పిల్లలకి వండి పెట్టుకుని గుట్టుగా సంసారం చేసుకోనే ఆడదానికి సమ్మెలు, పోరాటాలు, వీధుల్లో ఊరేగడాలు అవసరమా? అని ముఖం చికిలించే సోదర సోదరీమణులు ఇంకా ఉన్నారు. ఈ సమ్మె పోరాటాలు ఏ ఒక్కరి జీతభత్యాల పెంపుకోసమో కాదు కదా? అందరి కోసం కదా? ఏవేవో డిమాండ్లు. చాలా చెబుతున్నారు. కార్మిక చట్టాలు, వ్యవసాయ చట్టాలు వగైరా. మనకెందుకు మగవారు చూసుకుంటారులే అనుకుంటున్న సోదరీమణుల సంఖ్య తక్కువేమీ కాదు. కానీ నేననేదేమంటే సమ్మె అవసరం ఆడవాళ్ళకు ఎక్కువగా ఉన్నదని. ఎక్కడేమి జరిగినా మన కొంపకే చుట్టుకుంటుంది. కానీ అవి మనకు అర్థం కావడం లేదు. మన ఇల్లు, మన వాకిలి, మన చాకిరీతో సరిపోతుంది. అయినా ఎక్కడేమి జరుగుతుందో తెలుసుకోవాలి. తెలుసుకుని ముడుచుకుని కూర్చోకుండా సంగతేందో తేల్చుకోవాలి.
ట్రేడ్‌ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. నవంబర్‌ 26న దేశవ్యాపిత సమ్మె చేయాలని. ప్రభుత్వం బరితెగించి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కాదు అన్నట్టు కరోనా రోగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను కదలనివ్వకుండా మెదలనివ్వకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, జనం కండ్లుగప్పి, జనం సొమ్ము దోచుకుని కార్పొరేట్లకు కట్టబెట్టుతుంటే చూస్తూ ఊరుకుంటామా? కార్మిక సంఘాలు నడుం కట్టాయి. అన్ని సంఘాలు కలిసి నిలబడ్డాయి. బరితెగించిన ప్రభుత్వ చర్యలకు 'ఇప్పుడే' అడ్డుకట్ట వేయాలని సంకల్పించాయి. దేశవ్యాపిత సమ్మెకు పిలుపునిచ్చాయి. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు తోడుగా నిలిచాయి. గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చాయి. కార్మికులు సమ్మె చేస్తారు. రైతులు కూడా చేస్తారా? అంటే చేస్తాం అని అంటున్నారు. పాల కేంద్రాల్లో పాలు పొయ్యం. ఖాళీ వ్యాన్లు వెనక్కు తిప్పి పంపుతాం అంటున్నారు.
మరి స్త్రీల సంగతేంటి? వరుసగా ఒకటి, రెండు, మూడు కారణాలు చెబుకుందాం. వారం రోజుల క్రిందట ఒక గ్రామం వెళ్ళాను ఉపాధి పనులు, డ్వాక్రా గ్రూపులు పరిశీలిద్దామని. పొలాలనుంచి వచ్చి కాస్త సేదదీరి వంటా, వార్పు చేసుకుని రాత్రి వేళప్పుడు మీటింగ్‌కు వచ్చారు. గొల్లుగొల్లుమంటూ డ్వాక్రా సమస్యలు ఏకరువు పెట్టారు. రాజశేఖరరెడ్డి హయాంలో అభయహస్తం పేరుతో ప్రతి ఆడ మనిషి నుంచి రూ.3200 పైగా వసూలు చేసిన డబ్బు బ్యాంకుల్లో మూలుగుతోంది. పెన్షన్లు రాలేదు. డబ్బు తిరిగి ఇచ్చిందిలేదు. తీసుకున్న రుణాలకు వడ్డీ నెలకు రూ.1 నుంచి రూ.1.50 పైసల వరకు పడుతుందని ఆవేదన పడుతున్నారు. పావలా వడ్డీ ఊసేలేదు. తీసుకున్న అప్పులు వ్యవసాయానికి పెడుతున్నారు. ఏ కొద్ది మందో గేదెలు కొని పాడి చేస్తున్నారు. మరి మహిళల సాధికారత మాటమేమిటి? డ్వాక్రా పేరుతో ఆడవాళ్ళచేత పొదుపులు చేయించి బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించి వ్యవసాయ ఖర్చులు, కుటుంబ ఆర్థిక భారాలు స్త్రీల నెత్తిన వేయడమే కదా? ఆర్థిక మంత్రి 'నిర్మలక్కయ్య' చాలా ప్యాకేజీలు ప్రకటించారు. లక్షల కోట్ల ప్యాకేజీలు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా మహిళలకు అందలేదు. పైపెచ్చు వేలు, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టినవారు ఉన్నారు. వాళ్ళను ఏం చేసారు? ఏ జైలుకు పంపారు? నీరవ్‌మోడీ, విజయమాల్యాలు ఎక్కడున్నారు? ఇక్కడ ఇంకో మోసం ఉన్నది. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న డబ్బు వందల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మూలుగుతున్నది. ఆ డబ్బు తిరిగి తీసుకోవడానికి బ్యాంకర్లు అభ్యంతరాలు చెబుతున్నారు. మహిళలు దాచుకున్న పొదుపు సొమ్ముపై ఆరున్నర శాతం వడ్డీ. మహిళలు తీసుకున్న రుణాలపై 12శాతానికి పైగా వడ్డీ. సకాలంలో కట్టలేకపోతే వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తారు. గ్రామీణ కుటుంబాలు వారి పొదుపు మొత్తాలు ఎక్కడా గ్యారెంటీలేక బ్యాంకుల్లో డిపాజిట్లు వేస్తున్నారు. ఆ డిపాజిట్లే బడా పారిశ్రామికవేత్తలకు రుణాలుగా ఇస్తున్నారు. ఆ రకంగా చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరుతున్నాయి. రుణాలు ఎగవేసే బడా బాబుల సంఖ్య పెరిగితే మన డిపాజిట్లు గల్లంతైతే ఏమిటి పరిస్థితి?
ఇకపోతే ఉపాధి కార్మికులు. వామపక్షాల ఒత్తిడితో కేంద్రం గతంలోనే ఉపాధి హామీ పథకం తెచ్చింది. ఇది పేరుకు పేద ప్రజల ఉద్దరణ పథకం. ఆచరణలో పేద మహిళల శ్రమ దోపిడీ పథకంలా మారింది. పనిచేసేది ఎండల కాలం. ఇటీవల ఒక గ్రామంలో సర్వే చేస్తే తేలిందేమంటే ఒక్కో కుటుంబానికి 40రోజులకు మించి పని ఇవ్వలేదు. రోజుకు ఒక్కొక్కరికి రూ.60-70 నుంచి రూ.230కి మించి వేతనం అందలేదు. రోజుకు రూ.60 ఇచ్చే ప్రభుత్వ పథకం ఈ దేశంలో తప్ప ప్రపంచంలో మరేదేశంలోనైనా ఉన్నదా? ఈ పథకం క్రింద పనిచేసేవాళ్ళల్లో ఆడవాళ్ళు 58శాతం. పథకం ప్రకారం మూడవ వంతు పని స్త్రీలకు ఇవ్వాలి. కానీ సగానికిపైగా స్త్రీలు పనిచేస్తున్నారు. అంటే మగవాళ్ళు ఆసక్తి చూపడంలేదన్నమాట. ఇది చాకిరి స్త్రీల పరమైతున్నవైనం (ఫిమినైజేషన్‌ ఆఫ్‌ లేబర్‌). వీరు చేసిన పని రైతులు సాగుచేసుకుంటున్న భూముల్లో కంపచెట్లు పీకడం. అవి పిచ్చిమొక్కలు కాదుసుమండీ, ఏముందిలే పీకిపారేయడమేగా అనుకుంటున్నారేమో. చెట్ల మొదళ్ళు గునపాలతో తవ్వి, గొడ్డళ్ళతో నరికిపారెయ్యాలి. ఇక్కడ మరో కుట్ర దాగున్నది. ఒక్కో మనిషికి రోజుకు రూ.60 నుంచి రూ.230 వచ్చాయనుకున్నాం కదా! ఈ వేతనం రోజు వేతనం కాదు, గుండుగుత్తగా వేతనం నిర్ణయిస్తారు. లేదా కాంట్రాక్ట్‌ అనుకోవచ్చు. ఇది ఎలా నిర్ణయిస్తారంటే రోజుకు 8గంటలు పని దినంగా నిర్ణయించి పొలం విస్థీర్ణాన్ని బట్టి ఎన్ని పని దినాలు అవసరమో లెక్కగట్టి ప్రభుత్వం డబ్బు సాంక్షన్‌ చేస్తుంది. ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల వేతనాలు నిర్ణయించేటప్పుడు దుక్కిదున్నడాన్ని ఐదు గంటల పనిదినంగా నిర్ణయిస్తుంది. మరి 58శాతానికి పైగా మహిళలు పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం క్రింద ఎండల కాలంలో కఠిన శ్రమకు 8గంటల పనిదినంగా నిర్ణయించడం న్యాయమా? ఇదేనా పేద మహిళల ఉద్దరణ? వ్యవసాయ చట్టాలు.. అదేదో రైతుల సమస్యకదా అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ వ్యవసాయంలో నూటికి 70-80శాతం పనులు స్త్రీలే చేస్తున్నారు. వ్యవసాయంలో వచ్చే నష్టాల భారాలు స్త్రీలపై పడుతున్నాయి. డ్వాక్రా రుణాలు కూడా వ్యవసాయానికే పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాలు అమలయ్యి, కనీస మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర రాక స్వదేశీ, విదేశీ, బడా వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటే ఆ భారాలు పడేది స్త్రీల మీద కాదా? పై పెచ్చు ఇది రైతుల సమస్య మాత్రమే కాదు. ధాన్యం, పప్పులు, నూనె గింజులు తదితర ఆహార ధాన్యాల ధరల నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనుంచి ఎగిరిపోయి బడా వ్యాపారుల చేతుల్లో పడడం ఖాయం. ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టానికి మార్పులు తెచ్చి తూట్లు పెడుతుంది. అంటే బడా బాబుల లాభాలకు మితం ఉండదు. ఎంతకైనా అమ్ముకోవచ్చు, ఈ దేశ ప్రజలను కార్పొరేట్లు ఆవకాయ బద్దలాగా నంజుకు తినడానికి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలలో మార్పులు తెచ్చింది. ఇప్పుడు చెప్పండి సమ్మె చేద్ధామా? ఇంట్లో కూర్చుందామా?
ఇక కార్మిక చట్టాలు. ప్రతి రోజూ పత్రికల్లో వివరాలు వస్తూనే ఉన్నాయి. కనీస వేతనానికి దిక్కులేదు. 8గంటల పనిదినం ఎగిరిపోతున్నది. ఉద్యోగంలో పర్మినెంట్‌ అన్నపదం ఊడిపోతున్నది. 'యూజ్‌ అండ్‌ త్రో'. 'వాడుకో పారేరు'. ఇది పారిశ్రామిక వేత్తల నినాదం. సంపద సృష్టించే కార్మికవర్గానికి గాని, తిండిగింజలు పండించే రైతాంగానికి గాని భూమిమీద నూకలుంచేట్లులేవు ఈ ప్రభుత్వాలు. ఒట్టిపోయిన పాడిపశువులను కభేళాలకు తోలే స్థితి మనకు తెలుసు. ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు చాకిరి చేస్తాం. తర్వాత చస్తే ఈడ్చే దిక్కుకూడా లేని స్థితి తెచ్చుకుందామా? లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల దీర్ఘయాత్రల రక్తపు చారలు మనం ఇంకా మరవలేదుకదా? అందుకే సమ్మెకు సన్నద్ధమవుదాం. యువతకు, మహిళలకు ఎక్కడా ఉద్యోగాలు దొరికే స్థితి లేదు. సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ తీసుకుంటున్న వాళ్లు కూడా ఉపాధి కూలీలుగా మారుతున్నారు. మహిళల ఉద్యోగిత 39శాతం ఉంటే, పని కోల్పోయినవారు 54శాతం ఉన్నారు. మహిళలు చేసే చిన్నచిన్న వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. షాపులు, రెస్టారెంట్లు నడిపే స్త్రీలు, ఇళ్ళల్లో పనిచేసే కార్మికులు లక్షల సంఖ్యలో పని కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న బీడీ, టెక్స్‌టైల్‌, రొయ్యల కంపెనీలు, జీడిపప్పు కంపెనీల్లో పనిచేసే కార్మికులకు చాకిరి తప్ప ఫలితం మిగలడం లేదు. పుండుమీద కారం చల్లినట్లు కార్మిక చట్టాలకు కూడా చెల్లుచీటి ఇచ్చి పరిశ్రమాధిపతుల లాభాపేక్షకు, కార్మికుల శ్రమ ధోపిడీకి లైసెన్సులు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వాలను ప్రజాస్వామ్య ప్రభుత్వాలందామా? హక్కులకోసం, ఆత్మగౌరవం కోసం ప్రశ్నించే గొంతులను కూడా నొక్కుతున్నారు. స్త్రీల గౌరవ మర్యాదలకు, మాన ప్రాణాలకు రక్షణ లేదు. హత్రాస్‌ ఘటన మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.
అందుకే సోదరీమణులారా ఒంటిరిగా ఉండి సాధించేదేమీలేదు. సమ్మె చేద్ధాం. సమ్మె నినాదాన్ని వాడవాడకు తీసుకెళ్థాం. ఈ దేశంలో సతీ సుమతి, సతీ అనుసూయలే కాదు, ఝాన్సిలక్ష్మీలు, రాణీ చెన్నమ్మలు కూడా ఉన్నారు. రాచరికాన్ని ఎదిరించిన కన్యక, నంగేళి కూడా ఈ గడ్డమీదే పుట్టారు. వారిని ఆదర్శంగా తీసుకుందాం.

- ఎస్‌. పుణ్యవతి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మన మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు
పంట విలాపం!
నేతాజీ పేరిట తృణమూల్‌, బీజేపీ లొల్లి
ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..?
మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...

తాజా వార్తలు

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

05:20 PM

వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

05:11 PM

నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

05:08 PM

పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.