Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నవంబర్‌ 26న ఆర్టీసీ సమ్మెను అందరూ బలపరచాలి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 25,2020

నవంబర్‌ 26న ఆర్టీసీ సమ్మెను అందరూ బలపరచాలి

భారతదేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ వల్ల ప్రజలు, కార్మికులు ఉపాధిలేక, ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే, కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 'ఇప్పుడు కాకపోతే మరెప్పుడు' చేయలేం అనే నినాదంతో మొత్తం ప్రభుత్వ రంగాన్ని అమ్మి వేయడంతో పాటు, విచ్చలవిడిగా విదేశీ నిధులకు ద్వారాలు తెరిచింది. బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలను అంతే తీవ్రస్థాయిలో ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని భారతదేశ కార్మికవర్గానికి నాయకత్వం వహిస్తున్న 10జాతీయ కార్మిక సంఘాలు (బిఎంఎస్‌ మినహా), వివిధ రంగాలకు చెందిన ఫెడరేషన్స్‌ సంయుక్తంగా నవంబర్‌ 26న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెతో ప్రభుత్వం తన విధానాల నుంచి వెనక్కి మళ్ళనట్టయితే, బహుళ దిన సమ్మెలకు కూడా కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాయి.
పరాయి పాలనలో వందల సంవత్సరాలు మగ్గిన భారత ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం పోరాడిన పోరాట స్ఫూర్తిని తీసుకోవాలని, మన పాలకులే మొత్తం పరాయి దేశాల పెట్టుబడిదారులకు, స్వదేశ పెట్టుబడిదారులకు ప్రజల సొమ్మంతా (ప్రభుత్వ రంగ సంస్థలు) దోచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకోవాలని, ఈ సమ్మె ఒక దేశభక్తియుత సమ్మెగా పిలుపునిచ్చారు. అటువంటి దేశభక్తియుత సమ్మెను బలపరుస్తున్నామని, దేశవ్యాప్తంగా పని చేస్తున్న 200లకు పైగా వున్న రైతు సంఘాలు ప్రకటన చేశాయి. నవంబర్‌ 26, 27 తేదీలలో దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని వ్యవసాయ, రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఇంతటి మహత్తర సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వామపక్షాలు ప్రకటించాయి. ఇటీవలే మన రాష్ట్రంలోని పాలక పార్టీగా వున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సైతం బీజేపీ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన సమ్మె సరైందని ప్రకటన చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా సమ్మెను సపోర్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ సమ్మెలో పాల్గొనాలంటూ పోస్టర్స్‌ ఆవిష్కరించారు. మన రాష్ట్రంలో పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ కెవి, టీఎన్‌టీయూసీ, రెండు ఐఎఫ్‌టీయూలు జాతీయ సంఘాలతో పాటు సమ్మె చేస్తామని, సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.
రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఆ రంగాన్ని మొత్తంగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేలా వున్నాయి. మొత్తంగా దేశంలో పనిచేస్తున్న ఆర్టీసీలన్ని తమ ఉనికిని కోల్పోయి, బలవన్మరణం పాలయ్యేలా చేస్తున్నారు. ఎం.వి. యాక్ట్‌ సవరణ చట్టంలో పర్మిట్స్‌ విధానంలో తీసుకొచ్చిన మార్పులను ఆసరా చేసుకొని టూరిస్ట్‌ బస్‌లను కూడా పరిమితమైన పన్నుతో దేశమంతా స్టేజి కారేజీలుగా నడుపుకొనేందుకు అవకాశం కల్పించబోతున్నారు. ప్రత్యామ్నాయ ఇంధనం పేరుతో విద్యుత్‌ బస్‌లను ప్రోత్సహిస్తూ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు లాభాలు దోచిపెట్టేలా విధానాలు రూపొందించి, ఆర్టీసీలను కుంగదీస్తున్నారు. భారతదేశ చట్టాలలో లేని 'అగ్రిగేటర్స్‌' (యాప్‌ ఆధారంగా ఆపరేట్‌ చేసే సంస్థలు) వ్యవస్థను తీసుకొచ్చి, కార్లు తోలే డ్రైవర్స్‌ను దోచుకునేందుకు ద్వారాలు తెరిచారు. ఇప్పుడు 'ఉబర్‌' కంపెనీకి భారతదేశంలో బస్‌లు నడపడానికి 'అగ్రిగేటర్‌'గా అనుమతి ఇచ్చారని, కరోనా నేపధ్యంలో ఆలస్యమైందని, త్వరలో బస్‌లను నడుపనున్నామని ఆ సంస్థ ప్రకటించింది. 'లండన్‌ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు' పేరుతో మొత్తం బస్‌ రవాణా వ్యవస్థను అంతర్జాతీయ సంస్థలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ కరోనా కాలంలోనే కేంద్రం డీజిల్‌పై రూ.13కు పైగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంచింది. రోజువారీ ధరల స్థిరీకరణ పేరుతో లీటర్‌కు రూ.6కు పైగా ధరలు పెరిగాయి. దీని ఫలితంగా ఆర్టీసీల ఇంధన ఖర్చు అంతకంతకు పెరుగుతూ పోతున్నది. ఆర్టీసీ యాక్ట్‌ 1950 చట్ట ప్రకారం ఆర్టీసీలకు 1:2 నిష్ఫత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నిధులు నిలిపివేశాయి. నిధుల లేమిని ఎదుర్కొంటున్న ఆర్టీసీలు బస్‌ల సంఖ్యను పెంచలేక, తన ఆపరేషన్స్‌ను తగ్గించు కుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో 837బస్‌లు తగ్గించుకోవడం ఒక ఉదాహరణ. ఇన్ని రకాల పన్నులు చెల్లిస్తూ, ప్రజల కోసం ప్రయాణికులు ఉన్నా లేకున్నా బస్‌లు నడుపుతున్న ఆర్టీసీలకు ఆదాయానికి, ఖర్చులకు మధ్య తీవ్రమైన వ్యత్యాసము వస్తున్నది. దీనినే ప్రభుత్వాలు ఆర్టీసీకి నష్టంగా చూపిస్తూ, కార్మికులపై విపరీతమైన పని భారాలు పెంచుతున్నారు. జీతాలకు డబ్బులు లేవని 12వ తేదీ వరకు జీతాలు ఇవ్వడం లేదు. ప్రజలు పెరుగుతున్న దామాషా లో బస్సుల సంఖ్య పెరగనందున, ప్రజలు ప్రయివేటు వైపు వెళ్ళక తప్పని స్థితిని సృష్టిస్తున్నారు.
ప్రజా రవాణా సంస్థలు నిర్వీర్యం అయితే నష్టపోయేది కార్మికులు మాత్రమే కాదు. ఆయా రాష్ట్రాలలోని ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారు. ప్రజల ప్రయాణ అవసరాలకు ప్రయివేటుపై ఆధారపడవలసి వస్తుంది. విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ విద్యార్థులకిచ్చే రాయితీలు లేకపోతే సగం మంది పిల్లలు చదువులకు దూరమవుతారు. అలాగే నిత్యం డబ్బులు వచ్చే రూట్లలోనే ప్రయివేటు బస్‌లు నడుపుతారు తప్ప మారుమూల ప్రాంతాలలో వున్న గ్రామాలకు బస్‌ సౌకర్యం వుండదు. ఆ ప్రాంతాలు అన్నీ అభివృద్ధికి దూరం అవుతాయి. అన్ని రంగాలపై దీని ప్రభావం వుంటుంది. ఇంకా అనేక రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోవలసి వస్తుంది.
అందుకని ఆర్టీసీ రక్షణ కోసం నవంబర్‌ 26న ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రజలు కూడా మద్దతు పలకాలి. సమ్మెకు పిలుపివ్వని కార్మిక సంఘాలు కూడా పునరాలోచించాలి. ఈ సమ్మెలో భాగస్వాములు కావాలి.

- పుష్పా శ్రీనివాస్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!
ధర్మం నడిచేది నాల్గు పాదాలమీద కానేకాదు!
అమెరికాలో అగంతక రాజకీయాలు
పదోన్నతులకు ప్రాతిపదిక ఏమిటి?
పదవీ విరమణ వయసు పెంపు
ఇది మరో జాతీయ పోరాటం
కేరళే ప్రత్యామ్నాయం
'మార్పు మనలోనూ రావాలి.!'
చైనాపై మాటలకుస్తీ.. మోడీ విదేశీ భక్తి..
మరో ప్రమాదకర ప్రతిపాదనలు
వద్దంటుంటే రుద్దుతారెందుకు?
యోగి.. రాజ్యాంగ వ్యతిరేకి..

తాజా వార్తలు

01:20 PM

నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

01:11 PM

హైదరాబాద్‌లో దారుణం...

01:05 PM

బేగంపేట్ ​ఫ్లై ఓవర్ డివైడర్​ను ఢీకొట్టిన లారీ

12:58 PM

ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం

12:54 PM

బస్సు బోల్తా.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

12:35 PM

రైతుల ట్రాక్టర్ పరేడ్ పై విచారణ వాయిదా..

12:29 PM

టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

12:26 PM

రూ.5కే కిలో ట‌మాట‌

12:19 PM

రైలు ఢీకొని వ్యక్తి మృతి

12:10 PM

రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన మోడీ

12:03 PM

కారునే వెనక్కి లాగాలని చూసిన పులి..

11:55 AM

వండర్‌లా రూ .699 ఆఫర్ మరో రెండు వారాల పాటు

11:52 AM

ప్రేమజంట ఆత్మహత్య

11:49 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

11:32 AM

మాజీ క్రికెట‌ర్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్పత్రికి తరలింపు

11:23 AM

అల్లుడికి 125 వంటకాలు వడ్డించిన అత్తింటి వారు

11:17 AM

ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లతో అపశృతి..

11:09 AM

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

11:05 AM

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?: ఈటల

10:44 AM

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌

10:37 AM

తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

10:35 AM

బర్డ్ ఫ్లూపై కేంద్రం కీలక ప్రకటన..

10:27 AM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు...

10:15 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న వార్డు బాయ్ మృతి

10:06 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం...

09:58 AM

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

09:11 AM

2కే రన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్

08:50 AM

కత్తులు, రాళ్లతో కొట్టుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు

08:42 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టు ర‌న్ వేపై చిరుత‌

08:33 AM

మణిపూర్‌, మహారాష్ట్రలో స్వల్ప భూకంపం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.