Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు జరుగనున్న ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికలను విడుదల చేశాయి. ఇచ్చిన వరాలు పూర్తిగా అమలు పరచడం అసాధ్యం. కనీసం కొంతమేరకైనా అమలు పరచాలన్నా అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం. అధికారంలోలేని బీజేపీ మ్యానిఫేస్టోలో వరదసాయం రూ.25వేలు, ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ రద్దు, మోట్రోరైలు, సిటీ బస్సుల్లో మహిళలకు టికెట్టులేని ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. సిటీలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు రద్దుచేస్తామన్నారు. ప్రస్తుతం నగర మున్సిపాలిటీ, అవసర, ప్రయోపయోగ పనులు చేయటానికే వచ్చే ఆదాయం సరిపోక అనేక పనులు, బిల్లులు, పెండింగ్‌లో పెట్టి నెట్టుకురావటం జరుగుతున్నది. టెంపరరీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేమనీ, అంత ఆదాయం సంస్థకు లేదనీ హైకోర్టులో కేసువేసి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేల బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వందే తమ మ్యానిఫేస్టోను ఎలా అమలు చేయగలుగుతుందో అగమ్యగోచరం. ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌లు రద్దుచేస్తే సంస్థ ఆదాయం తగ్గుతుంది. మహిళలకు ఉచిత సిటీ బస్సు ప్రయాణం నిర్ణయం ఆర్టీసీ వారిది. ఆర్టీసీ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది. మెట్రోలో ఉచిత ప్రయాణం ఎల్ అండ్ టీ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. జీహెచ్‌ఎంసీకి సంబంధం లేదు. బీజేపీ వారి అవగాహానా రాహిత్యానికి, అసంబద్ధ ప్రచారానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలి? బీజేపీ తన ఎన్నికల ప్రణాళిక అమలు పరచాలంటే తమ పార్టీ అధికారంలోనున్న కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి. మొత్తం రాష్ట్రమంతా అకాల వర్షాలతో, వరదలతో, లక్షల ఎకరాల్లో పంట నష్టం, నగరం మునిపోయి వేల కోట్ల నష్టం జరిగి, పదుల సంఖ్యలో ప్రాణాలు పోయి, చావలేక బతుకుంటే పైసా విదల్చని బీజేపీ కేంద్ర ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలు ఇస్తుందా! పైసా కూడా రాల్చదనేది అనుభవం. కాబట్టి బీజేపీ వారి వాగ్దానాలు పచ్చి మోసపూరితాలు. వామపక్షాల మ్యానిఫేస్టోలు తప్ప మిగతా పార్టీల మ్యానిఫేస్టోలన్నీ ఆచరణలో అసాధ్యాలు, మోసపూరితాలు. కాబట్టి హైదరాబాద్ ఓటర్లు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను గెలిపించటం అవసరం.
- టి. మోహనరావు
సెల్: 9908503977