Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కేరళే ప్రత్యామ్నాయం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 07,2021

కేరళే ప్రత్యామ్నాయం

మీడియాలో అధిక భాగం, ఢిల్లీ సరిహద్దులలో నిరసన తెలుపుతున్న రైతాంగం పైనే కేంద్రీకరిస్తుంది. భారతదేశ వ్యాపితంగా ఊరేగింపులు, నిరసనలు జరుగు తున్నాయి. కేరళలలో కూడా అనేక రూపాలలో ఈ ఉద్యమానికి ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. రాజ్యాంగంలో పొందుపరచబడిన ఫెడరల్‌ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారని వాదిస్తూ, కేరళ వామపక్ష ప్రభుత్వం తాను ఈ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని ప్రకటించింది. అయినప్పటికీ, కేరళ ప్రజల యొక్క ప్రజారంజకమైన సంఘీభావం ఆశ్చర్యకరంగా కనబడుతుంది. ఎందువల్లనంటే, ఆ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలు గానీ (APMC), మండీలుగానీ లేవు. అయినా కేరళ వ్యవసాయదారుల నుండి ఇలాంటి స్పందనకు తగిన కారణాలే ఉన్నాయి. వాస్తవంగా ఈ మూడు వివాదాస్పద చట్టాలను అమలు చేయడం వల్ల కేరళ ఎక్కువగా నష్టపోనప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నమైన విధానాలను పాటించడంలో ఉన్న తేడాల వల్ల, ఇలాంటి స్పందన కనబడుతుంది. ఈ మధ్యకాలంలో గిట్టుబాటు ధరలు పెంచడం, ప్రత్యక్షంగా వ్యవసాయ ఉత్పత్తులను సేకరించటం లాంటి విధానపరమైన చర్యలు చేపట్టడంతో, ఈ తేడా స్పష్టంగా కనబడుతుంది. ఆ విధంగా భారతదేశంలోని వ్యవసాయ విధానాలకు ఒక ప్రత్యామ్నాయాన్ని కేరళ చూపిస్తున్నది.
కేరళ వ్యవసాయ విధానంలో, స్థూల వ్యవసాయ విస్తీర్ణంలో సగానికి పైగా ఆహారేతర పంటలే ప్రధానంగా ఉంటాయి. అందుకే కేరళలో ప్రభుత్వాలు ఆహార పంటలను అభివద్ధి చేయడంపై దష్టి సారించాయి. ప్రధానంగా వరి పండించే వ్యవసాయ క్షేత్రాలను రక్షించడంపై కేంద్రీకరించాయి. పెరుగుతున్న ఖర్చులను, ఆహార పంటలు తక్కువ లాభదాయకమనే (ప్రధానంగా వరి పంట విషయంలో) విషయాన్ని గమనించకుండా ఈ విధానము రాలేదు. వరి పంటకు అనుకూలమైన భూములను వరి సాగుకు కేటాయించడమే కాకుండా వ్యవసాయానికి దోహదపడే అనేక ప్రోత్సాహకాలను కేరళ ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రజాస్వామిక సంఘటన (ఎల్‌.డి.ఎఫ్‌ ) ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రజల మద్దతును మరింతగా కూడా కట్టింది.
వరి సాగు దారులకు, మద్దతు ధర కల్పించడం అనేది ఎంతో ముఖ్యమైన సహాయక సాధనంగాపనిచేస్తుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సాగుకు అయ్యే ఖర్చును, ప్రధాన పంటల ఉత్పత్తిని తరచుగా సేకరించిన సమా చారం ఆధారంగా, సమగ్రంగా అధ్యయనం చేస్తుంది.
ఈ అధ్యయనాలు 2017-18 త్రైమాసికం ముగింపుకు వరి ఉత్పత్తికి అయ్యే ఖర్చును క్యింటాల్‌కు రు.1,311గా ప్రకటించింది. (వ్యవసాయ క్యాలెండర్‌ కు సంబంధించి 2015-16, 2016-17, 2017-18 మూడు సంవత్సరాల సరా సరి) 18 రాష్ట్రాలలో ఉత్పత్తి ఖర్చు విషయంలో సేకరించిన సమాచారం ప్రకారం, కేరళ రాష్ట్రం రెండవ పెద్ద రాష్ట్రంగా ఉన్నది. యాదచ్చికంగా అధికారిక గణాంకాలు, ఉత్పత్తి ఖర్చులను తక్కువ అంచనా వేస్తున్నాయి అని పరిశోధకులులతోపాటు రైతు సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. రైతులు పెట్టిన వాస్తవ పెట్టుబడులు, అధికారిక నివేదికలు తెలియజేసిన ధరల కంటే అధికంగా ఉన్నాయి.
అనేక కారణాల వల్ల కేరళలో అధిక పెట్టుబడులు ఉంటాయి. దానిలో ప్రధానమైనది వ్యవసాయ పనులుకై నియమించుకున్న వ్యవసాయ కార్మికులపై పెట్టే పెట్టుబడే, వ్యవసాయ ఖర్చులో ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. ఉత్పత్తికి అవసరమైన అధిక పెట్టుబడులు ఒకవైపు, కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే చాలీచాలని కనీస మద్దతు ధరలు మరొకవైపు కేరళలో ఉత్పత్తి ఖర్చు పెరగడానికి ఒక కారణం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కంటే స్థిరమైన బోనస్‌ను పారితోషికంగా ఇస్తుంది కేరళప్రభుత్వం. ప్రస్తుతం ఈ బోనస్‌ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉంటుంది.
2017- 18 సంవత్సరానికి గాను సరాసరి వరికి అయ్యే ఉత్పత్తి ఖర్చు 1616 రూపాయలుగా ఉంది. నూతన సంవత్సరానికిగాను, ధరలకు సంబంధించిన తాజా సమాచారం వారి వద్ద ఉంది. ప్రకటించిన కనీస మద్దతు ధర 2017 -18 కి గాను క్వింటాల్‌ ఒక్కింటికి 1550 రూపాయలు గా ఉంది. వాస్తవంగా కేరళలో ఖర్చుచేసిన ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువగా ఉంది. కేరళ ప్రభుత్వం బోనస్‌గా క్వింటాలుకు 780రూపాయలు ప్రకటించటం వల్ల, వరి పండించే వ్యవసాయదారుడు ఎకరాకు తాను చేసిన సరాసరి క్వింటాలుకు చేసిన ఉత్పత్తి ఖర్చు కంటే 44 శాతం అదనంగా పొందుతాడు. గత రెండు సంవత్సరాలుగా కేరళ ప్రభుత్వం వికేంద్రీ కరించబడిన సేకరణా ప్రణాళిక కింద, సంవత్సరానికి ఉత్పత్తికి అయినటువంటి వరిలో దాదాపు 80% సేకరిస్తుంది. ఈ మొత్తం దాదాపు 7 లక్షల టన్నుల వరకు ఉంటుంది. దీనికి భిన్నంగా భారతదేశం మొత్తంగా చూసినట్లయితే ధాన్య సేకరణ రెండు మూడు రాష్ట్రాల నుండే జరుగుతుంది. వాటిలో ప్రధానంగా పంజాబ్‌, హర్యానా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి, దేశంలో ఉత్పత్తి అయ్యే మూడవ వంతు ధాన్యం ఉత్పత్తి ఈ రాష్ట్రాల్లోనే జరుగుతుంది.
కేరళ వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చే మద్దతు వరి పంటకే పరిమితమై లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే కనీస మద్దతు ధరను 16 రకాల కూరగాయల పంటలకు విస్తరింపజేసింది. ఇలాంటి విధానాన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగా దష్టి పెట్టడం అనేది వ్యవసాయ మార్కెట్లలో జోక్యం చేసుకోవడం అనే పద్ధతిగా ఉంటుంది. కేరళ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ (ూఖ్‌ూూూజఉ), వివిధ రకాలైన కోపరేటివ్‌ సంస్థలతో పాటు, స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వ సంస్థలు వరి ధాన్యం సేకరణను సులభతరం చేస్తున్నాయి. ఈ విధానం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సామర్థ్యాన్ని గణనీయంగా విస్తత పరుస్తుంది. ఈ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్య యుతంగా చేయడమే కాక, కార్యాచరణలో, నిర్వహణలో మెరుగైన పారదర్శకతను కలగజేస్తుంది. రాబోయే మార్కెటింగ్‌ రుతువులలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, సహకార సంఘాలు ధాన్యాన్ని ప్రత్యక్షంగా కొనుగోలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. అదేవిధంగా నూతనంగా కూరగాయలకు ప్రకటించిన కనీస మద్దతు ధరను కూడా బలమైన నెట్వర్క్‌ కలిగిన కోపరేటివ్‌ సంస్థల సహకారంతో నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో స్వయం సహాయకబందాలతో ఏర్పాటు చేయబడిన రైతాంగాన్ని కూడా భాగస్వాములను చేశారు.
వ్యవసాయ రంగంలో కేరళ ప్రభుత్వ జోక్యం ఈ రెండు విధానాలకే పరిమితం కాలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో మరింత ఉత్పత్తిని పెంచడానికి, లాభదాయకంగా మార్చడానికి అనేక సవాళ్లను రాష్ట్రం ఎదుర్కొనవలసి వస్తుంది. కానీ, కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రత్యక్షంగా భిన్నమైన విధానాలు. కేంద్రప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రైవేటు వ్యక్తులకు మార్కెట్‌ తలుపులను బార్లా తెరిచి, వ్యవసాయ రంగం నుండి పూర్తిగా వైదొలిగే విధానానికి కేరళ అనుసరించే విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. ఇలాంటి సమగ్రమైన విధానాన్ని అనుసరించటం వల్ల, రైతులకై ఏర్పడిన జాతీయ కమిషన్‌ (స్వామినాథన్‌ కమిషన్‌) ప్రతిపాదనలను కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆ విధంగా రాష్ట్ర వనరులను నూతన మార్కెట్‌ యార్డుల కోసం, సేకరణ కేంద్రాల కోసం ఖర్చు పెడుతూ, గ్రామీణ మార్కెట్లకు అనుసంధానం చేస్తూ, విస్తరించాలనే సమగ్రమైన లక్ష్యాన్ని కలిగి ఉంది.
కేరళ పాలనా వ్యవస్థ యంత్రాంగంలో మార్కెటింగ్‌ విభాగాల్లో మధ్యవర్తుల జోక్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం దాని విశిష్టత. కేరళ అనుసరిస్తున్న విధానం రైతాంగ సహకార సంస్థలను బలోపేతం చేయడమే కాక, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రంలోని చిన్న, మధ్య తరగతి రైతాంగాన్ని సమన్వయం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. స్థిరమైన గిట్టుబాటు ధరలు, పారితోషికాలు, ఆదాయాలు తనకు తానే సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కేంద్రం ప్రతిపాదిస్తున్న విధానాలకు భిన్నమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని కేరళ ప్రభుత్వం అందిస్తున్నది.

- దీపక్‌ జాన్సన్‌
(వ్యాసకర్త ఎకనామిక్‌ ఎనాలిసిస్‌ యూనిట్‌)
అనువాదం : మల్లెంపాటి వీరభద్రరావు, ఖమ్మం జిల్లా
సెల్‌: 9490300111

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
హత్యలు.. న్యాయం.. రాజ్యం..
భవిష్యత్‌ రాజకీయాలపై రైతాంగ పోరాట ప్రభావం
ఎల్‌ఐసీ అమ్మకం చారిత్రక తప్పిదం
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి...
వాళ్లవల్లే.. మేమే గ్రేట్‌
అయ్యో దేవుడికెంత కష్టం!
ఎవరు కన్న బిడ్డరా.. ఎక్కి ఎక్కి ఏడ్చింది..
'న్యూస్‌క్లిక్‌'ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
త్యాగాల పాట..
ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పా భార్గవ

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.