Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అక్షర భాస్కరుడు... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 12,2021

అక్షర భాస్కరుడు...

జననం, మరణం ఒకే రోజు. ఆ జననానికీ మరణానికీ మధ్య తాను అనుభవించిన జీవితమే ఆయన కవిత్వం. చెరచబడ్డ చెల్లినీ, ఎక్కుపెట్టిన తుపాకీన కవిత్వీకరించిన శక్తి అతడు. వేశ్యకి నిజమైన అర్థం చెప్పి. కుందేలు చర్మం కప్పుకున్న తోడేళ్ల నిజరూపం బయటపెట్టిన వాడు. అక్షరాలకు ఆయుష్షు పోసి, తన కుంచెతో పేదల బతుకు చిత్రాన్ని గీసి పోరాటానికి రంగులద్దినవాడు. క్యాన్సర్‌ కబలిస్తున్నా అక్షరాలను తాకట్టు పెట్టకుండా ''మరణం నా చివరి చరణం కాదు'' అని ప్రకటించిన నిఖార్సయిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్‌.
ప్రస్తుత జగిత్యాల జిల్లాలో అలిశెట్టి ప్రభాకర్‌ 12 జనవరి 1954లో జన్మించాడు. అలిశెట్టి చిన్నరాజం, లక్ష్మిలు ప్రభాకర్‌ తల్లిదండ్రులు. 12 జనవరి 1993లో మరణించాడు. తను బతికింది కేవలం 39 సంవత్సరాలు మాత్రమే.. కానీ తన రచనలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. చదువుకుంది ఇంటరే అయినా సమాజాన్ని చాలా నిశితంగా పరిశీలించాడు. కష్టాలను ఎదుర్కొవడంలో పీహెచ్‌డీలే చేశాడు. అందుకేనేమో బూజు పట్టిన పుస్తకాల్లో ఉన్న చెత్తను తలకు ఎక్కించుకోకుండా తనదైన శైలిలో సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాన్ని అక్షరాలతో కడిగాడు. తాను రాసిన ప్రతీ కవిత ఓ ఆయుధం అయితే ఆ కవితలోని అక్షరాలు బులెట్ల కంటే పదునైనవి.
బతుకుదెరువులో భాగంగా తొలుత కరీంనగర్‌లో ఫొటో స్టూడియోను ప్రారంభించాడు. అలాగే చిత్రాలు కూడా గీసేవాడు. అప్పట్లో కరీంనగర్‌లో దొరల పెత్తనం విపరీతంగా ఉండేది. ఈ క్రమంలో రైతుకూలీలు, రైతులు దొరలపై తిరగబడ్డారు. జగిత్యాల జైత్రయాత్ర పోరు నడిపారు. ఈ పోరులో అలిశెట్టి ప్రభాకర్‌ ముందు నిలిచాడు. ఆ పోరాటం విజయం సాధించింది. ఆ తరువాత అలిశెట్టి కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు మకార మార్చాడు. నగరంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కనీసం పూట గడవడమే కష్టంగా ఉన్న సమయంలో కూడా తన అక్షరాలను తాకట్టు పెట్టలేదు. పైగా తనలోని కవిని మరింతగా తట్టిలేపాడు. అలిశెట్టి చివరి రోజుల్లో క్యాన్సర్‌తో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేని సమయంలో కూడా తన జ్ఞానాన్ని కాసులకు తాకట్టు పెట్టలేదు. సినిమాల్లో రాసే అవకాశం వచ్చినా అటువైపు తొంగి చూడలేదు. జబ్బుతో మంచంపై ఉండి కూడా సమాజాన్ని చైతన్యం చేసే కవితలే రాశాడు కానీ తన ప్రాణాలను కాపాడుకోవాలని ఏ రోజు పరితపించలేదు. ఇందుకు నిదర్శనమే తాను రాసిన కవితా సంపుటిలు.
నగర ప్రజలు పడుతున్న బాధలను ఆంధ్రజ్యోతిలో 'సీటి లైఫ్‌' పేరుతో ప్రజల ముందుకు తేచ్చాడు. అలిశెట్టి రాసిన పుస్తకాల్లో ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. అప్పట్లో నగర ప్రజలు అనేకులు నిద్రలేవడమే ఆలస్యం ఆ సిటీలైఫ్‌ కోసం ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. ఎర్ర పావురాలు, రక్తరేఖ, చురకలు, మంటల జెండాలు, మరణం నా చివరి చరణం కాదు ఇలా అనేక పుస్తకాలు అలిశెట్టి కలం నుంచి జాలువారినవే.
తను శవమై.. ఒకరికి వశమై..
తనువు పుండై. ఒకరికి పండై
ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సయి
అంటూ ఆకలి తీర్చుకోవడం కోసం ఓ మహిళ వేశ్యగా మారిన స్థితిని అలిశెట్టి కండ్లకు కట్టినట్టు వివరించాడు.
నగరాల్లో అత్యధికంగా అత్యద్భుతంగా
ఆస్తి పంజరాల్నీ చెక్కే ఉలి ఆకలి.
అంటూ పల్లె నుంచి పట్నం వచ్చిన పేద ప్రజల వలస జీవిత చిత్రాన్ని తన అక్షరాల్లో వివరించాడు.
న్యాయాన్ని ఏ కీలుకు ఆ కీలు
విరిచేవాడే వకీలు.
అంటూ న్యాయవ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని బట్టబయలు చేశాడు.
ఒక నక్క
ప్రమాణస్వీకారం చేసిందంట
ఇంకెవ్వరినీ వంచించనని
ఒక పులి
పశ్చాత్తాపం ప్రకటించిందంట
తోటి జంతువుల్ని సంహరించినందుకు
ఈ కట్టు కథ విని
గొర్రెలు ఇంకా పుర్రెలూపుతూనే ఉన్నాయి..
అంటూ ప్రజాస్వామ్యం ముసుగులో రాజ్యమేలుతున్న భారత పార్లమెంట్‌ వ్యవస్థను కడిగిపారేశాడు.
ఇలా అలిశెట్టి కలం నుంచి జాలువారిన ప్రతీ అక్షరం సమాజంలో ఉన్న డొల్లతానాన్ని ఎత్తిచూపినదే. సమాజంలో అణగారిన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కండ్ల ముందు ఉంచినదే. ఎన్నికల పేరుతో ఏలికలు సామాన్య ప్రజలను ఎలా మభ్య పెడుతున్నారో వివరించి చెప్పినదే. మొద్దు బారిన మెదళ్లలో ఆలోచనలను రేకిత్తించి ఉద్యమ దారి చూపినదే. అందుకే అలిశెట్టి మరణించి దాదాపు 27ఏండ్లు అయినా ఇంకా ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నాడు. సమాజం కోసం కలం పట్టుకున్న ప్రతీ కవికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు. విప్లవోద్యోమం వైపు నడిచే వారికి వేగుచుక్క అయ్యాడు. కానీ నేటి ఆధనిక యుగంలో కాసులకు కుక్కుర్తి పడి పాలకులకు ఆస్థాన కవులుగా మారుతున్న వారు ఎందరో... పదవులకు ఆశపడి ఏలికలకు వంగి వంగి దండాలు పెడుతున్న వారు ఎందరో... నేటికీ ఆనాటి అసమానతలు, అవినీతి, అన్యాయాలు, ప్రజలను ముంచే పాలకులు, ఎండిన డొక్కలతో పట్నం వలస వచ్చే పేదలు, ఆకలి తీర్చుకోవడం కోసం ఒళ్లు అమ్ముకునే వేశ్యలు, న్యాయాన్ని నడి బజారులో అమ్మే వకీళ్లు సమసిపోలేదు. కనుక ఇప్పటికీ ఈ సమాజానికి కావాల్సింది అలిశెట్టి ప్రభాకర్‌లే. నేడు అలిశెట్టి ప్రభాకర్‌ జయంతీ, వర్థంతి కూడా. ఈ సందర్భంగా ఆ అక్షర శిల్పికి అశ్రు నివాళి.

- అజయ్ కుమార్‌
సెల్‌:8297630110


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అసలు వార్తలకు విషమపరీక్ష
డిస్కాంల నిర్వహణ లోపం-అప్రకటిత కోతలు
గుర్తింపు కోసం ఆశా కార్మికుల పోరాటం
లాఠీలతోనే ప్రజాభిప్రాయ సేకరణ!
''కార్మిక-కర్షక పోరుయాత్ర''
నా రైతు - నవ చరిత
మాయమవుతున్న రాజ్యాంగ మౌలిక స్వభావం
దేశభక్తి, మతం, ఆరెస్సెస్‌ భావజాలం
సమరం జయిస్తుంది...
మన మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు
పంట విలాపం!
నేతాజీ పేరిట తృణమూల్‌, బీజేపీ లొల్లి
ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..?
మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు

తాజా వార్తలు

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.