Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..?

2021 జనవరి 20కి అమెరికాలోనే కాదు ప్రపంచ చరిత్రలోనూ ఒక ప్రాముఖ్యత ఉంది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. నూటయాభై సంవత్సరా లలో తొలిసారిగా నూతనంగా ఎన్నికైన వారికి పదవీ బాధ్యతలు అప్పగించే కనీస మర్యాదను పాటించకుండా అధ్యక్ష భవనం నుంచి నిష్క్రమించిన వ్యక్తిగా డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రకెక్కాడు. ట్రంప్‌ చేసిన పనులకు ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలను చూడాల్సి వస్తుంతో ట్రంప్‌ చివరిరరరోజుల్లో సూచన ప్రాయంగా వెల్లడించాడని చెప్పవచ్చు.
మరో రూపంలో తాను తిరిగి వస్తానని ట్రంప్‌ తన మద్దతుదార్లకు సందేశమిచ్చాడు. రిపబ్లికన్‌ పార్టీని వీడి పేట్రియాటిక్‌ పార్టీ(దేశ భక్త పార్టీ) పేరుతో కొత్త దుకాణం తెరుస్తారనే వార్తలు వచ్చాయి. నిజంగానే పెడతారా లేక తన మద్దతుదార్లను సంతృప్తి పరచేందుకు అలా చెప్పారా అన్నది చూడాల్సి ఉంది. ఒక పార్టీ పెట్టటానికి అవసరమైన నిధులతో పాటు గుడ్డిగా అనుసరించే వారు కూడా గణనీయంగా ఉన్నట్టు ఇటీవలి ఎన్నికలు, అనంతర పరిణామాలు రుజువు చేశాయి. అయితే ట్రంప్‌కు ప్రధాన సవాలు రిపబ్లికన్‌ పార్టీ నుంచే ఎదురు కానుంది. శతాబ్దాల తరబడి రెండు పార్టీల మధ్యనే అధికారం చేతులు మారుతోంది. ఎవరు అధికారంలో ఉన్నా కార్పొరేట్‌ ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా ఉండటం లేదు. అందువలన ఒకసారి మూడో పార్టీ రంగంలోకి వస్తే అది మరికొన్ని పార్టీలు ఉనికిలోకి వచ్చేందుకు దారితీయవచ్చు. ఇప్పటి వరకు ఎవరు ఉన్నా తమ ప్రయోజనాలకు తోడ్పడుతున్నందున యధాతధ స్థితిని కొనసాగించాలనే కార్పొరేట్‌లు కోరుకుంటాయి. ట్రంప్‌ పార్టీ తమకు దెబ్బ అని గనుక భావిస్తే ఇప్పటి వరకు బలపరచిన కార్పొరేట్లే అడ్డుకున్నా ఆశ్చర్యం లేదు. ట్రంప్‌ పెద్ద వ్యాపారి కనుక ఈ లాభనష్టాలన్నింటినీ బేరీజు వేసుకొనే ముందుకు సాగుతాడన్నది స్పష్టం. ప్రధాన పశ్చిమ దేశాల్లో రెండు పార్టీల వ్యవస్థ స్థిరపడింది. దీని అర్థం అక్కడ ఇతర పార్టీలు లేవని కాదు. ఎన్నికల్లో అదో ఇదో మాత్రమే వచ్చే రెండు పెద్ద పార్టీలే ఉనికిలో ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థలు లేదా మీడియా కూడా వాటినే తప్ప మిగిలిన వాటిని పట్టించుకోవు. జనం కూడా అంతే తయారయ్యారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి చోట్ల ఇటీవలి కాలంలో మూడో పక్షాలు ఉనికిలోకి రావటమే కాదు, బలపడుతున్నాయి. అయితే అవన్నీ పచ్చిమితవాద లేదా ఫాసిస్టు తరహా పార్టీలు. అందువలన అమెరికాలో కూడా అలాంటి శక్తులు డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వాన సంఘటితం కావటం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. తాను విజయం సాధించకపోతే ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లే అని, ఓటమిని అంగీకరించను అని ముందే చెప్పిన, ఎన్నికల ఫలితాన్ని ఖరారు చేయకుండా అడ్డుకోవాలని దాడికి పురికొల్పిన ట్రంప్‌ను చూశాం. అధికార కుమ్ములాటలు మరింత ముదిరితే రేపు ట్రంప్‌గాకపోతే మరొకరు ఫాసిస్టు తిరుగుబాట్లనే రెచ్చగొట్టరన్న హామీ ఏముంది? నియంతలు, నరహంతకులు శాశ్వతం కాదు గానీ వారి ధోరణులు శాశ్వతమే కదా! ఫాసిజం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన జర్మన్లే జర్మనీకి ప్రత్యామ్నాయం(ఎఎఫ్‌డి) అనే 2013లో ఏర్పడిన ఫాసిస్టు పార్టీకి 2017 పార్లమెంటు ఎన్నికలలో 709స్థానాలకు గాను 94, 12.6శాతం ఓట్లు వేశారు. అందువలన అమెరికాలో శ్వేతజాతి దురహంకారం నరనరానా జీర్ణించుకుపోయిన సమాజంలో ఫాసిస్టు శక్తులు బలం పుంజుకోవటం ఆశ్చర్యం కలిగించదు. జర్మన్‌ నాజీలు రెండవ ప్రపంచ యుద్ధానికి, అనేక దేశాలను ఆక్రమించుకొనేందుకు కారకులు. వారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో సోవియట్‌ యూనియన్‌ నాయకత్వాన కమ్యూనిస్టులు ముందున్నారు. ఇది దాస్తే దాగేది కాదు. దీన్ని దాచి పెట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణనష్టానికి నాజీలూ-కమ్యూనిస్టులూ ఇద్దరూ కారకులే అనే తప్పుడు ప్రచారాన్ని చేయటమే కాదు, ఐక్యరాజ్యసమితిలో నాజీయిజంపై విజయాన్ని అంగీకరించేందుకు కూడా అమెరికా, ఐరోపా ధనికదేశాలు సిద్దంగా లేవు.
జో బైడెన్‌ అధికారాన్ని స్వీకరిస్తూ చేసిన ప్రసంగం సాధారణమైనదే. ఒక్క అమెరికాయే కాదు, యావత్‌ పెట్టుబడిదారీ సమాజం గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలను ఎదుర్కొంటోంది. గతంలో సోషలిజం విఫలమైంది అని ప్రచారం చేసే పెద్దలు ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలం అయింది అనే భావనకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలోని లక్షలాది మంది యువత అలాంటి భావనతోనే డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ వెనుక సమీకృతులైన విషయం తెలిసిందే. శాండర్స్‌ను వెనక్కు నెట్టి డెమోక్రటిక్‌ పార్టీ వెనుక ఉన్న కార్పొరేట్‌ శక్తులు తమ ప్రతినిధిగా జో బైడెన్‌ను ముందుకు తెచ్చారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీలోని సాంప్రదాయ మితవాదుల కంటే ముదుర్లయిన ఫాసిస్టు శక్తులు తలెత్తుతున్నాయనే అంశం గతం కంటే ఇప్పుడు మరింత స్పష్టంగా ట్రంప్‌ రూపంలో వెల్లడైంది. అతగాడి ప్రోద్బలంతో జనవరి 6న దేశ రాజధాని కేంద్రంలో సమావేశమైన పార్లమెంట్‌ ఉభయ సభల మీద దాడి చేసిన వారందరూ ఫాసిస్టు భావజాలం కలిగిన సంస్థలకు చెందినవారే. అధికారాంతమందు అనేక మంది నేరగాండ్లకు క్షమాభిక్ష పెట్టిన ట్రంప్‌... రాజధాని మీద దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు జారీ చేసినట్టు మనకు ఎక్కడా కనపడదు-వినపడదు.
దేశ చరిత్రలో బహుశా రాజధాని ప్రాంతంలో అప్రకటిత లాక్‌డౌన్‌ ప్రకటించి వేలాది మంది సాయుధ, గూఢచారుల నడుమ అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయటం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో ఇది వెల్లడిస్తోంది. అధ్యక్షుడిగా చివరి ప్రసంగంలో జో బైడెన్‌ పేరును ఉచ్చరించటానికి కూడా ట్రంప్‌ సిద్దపడలేదు. అమెరికా రాజకీయ వ్యవస్థను కూల్చివేసేందుకు జరిగిన కుట్ర వెనుక ఉన్న ట్రంప్‌ దుశ్చర్యలను జో బైడెన్‌ కూడా ఖండించలేదు. తన ఎన్నికను వమ్ము చేసేందుకు జరిగిన ఉదంతాన్ని కుట్ర అనేందుకు కూడా ఆ పెద్దమనిషి ముందుకు రాలేదు, కేవలం 'హింస' అని మాట్లాడారు. దానికి పాల్పడిన శక్తులను కూడా సంతుష్టీకరించేందుకు ఐక్యతా మంత్రాన్ని పఠించారు. అయినా తోడేళ్ల వంటి కార్పొరేట్లు మేక పిల్లల వంటి సామాన్యులు అందరూ ఒకటే అంటే అర్థం ఏమిటి ? చివరి నిముషంలో డోనాల్డ్‌ ట్రంప్‌ క్షమాభిక్ష పెట్టింది ఎవరికి? స్టీఫెన్‌ బనాన్‌ అనే ఒక ఫాసిస్టు ట్రంప్‌ 2016ఎన్నికల బాధ్యతలను చూశాడు. తరువాత అధ్యక్ష భవనంలో పని చేశాడు. మితవాదులారా(ఫాసిస్టు) ఏకం కండు అనే నినాదంతో 2017లో చార్లోట్స్‌విలేలో ప్రదర్శన నిర్వహించినందుకు పదవిని పోగొట్టు కున్నాడు. ట్రంప్‌తో ఎన్నడూ సంబంధాలను వదులు కోలేదు. తాజాగా కాపిటల్‌ మీద జరిగిన దాడిలో అతని హస్తం ఉంది. ఆ రోజు కాపిటల్‌కు రావాలని నాలుగు లక్షల మందికి వర్తమానాలు పంపాడు. అందువలన భవిష్యత్‌లో తనతో కలసి రావాల్సిన వ్యక్తి అనే ముందుచూపుతో అతన్ని క్షమించాడు. పెద్ద అవినీతి కేసులో అరెస్టయిన ఇలియట్‌ బ్రోయిడీ మరొకడు. 2016 ఎన్నికల్లో ట్రంప్‌కు మిలియన్ల డాలర్లు విరాళాల రూపంలో సంపాదించాడు. మలేసియా బిలియనీర్‌ ఝా లోవ్‌ మీద జరుగుతున్న దర్యాప్తు నిలిపివేయిస్తానంటూ 90లక్షల డాలర్లు లంచంగా తీసుకున్నాడు. డెమోక్రటిక్‌ పార్టీ మాజీ ఎంపీ, డెట్రాయిట్‌ మేయర్‌గా పని చేసిన క్వామే కిల్‌పాట్రిక్‌ ప్రతి అవకాశాన్ని డాలర్లుగా మార్చుకున్న అవినీతిపరుడు. ఇరవై ఎనిమిదేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జార్జి గిల్‌మోర్‌ అనేవాడు న్యూ జెర్సీలో రిపబ్లికన్‌ పార్టీ రాజకీయ బ్రోకర్‌. అవినీతి, అక్రమాలకేసులో జైల్లో ఉన్నాడు. ప్లోరిడా రాష్ట్రంలో వృద్ద రోగుల వైద్య సంరక్షణ పేరుతో 730లక్షల డాలర్లు కొట్టేసిన కంటి వైద్యుడు సలోమాన్‌ మెల్‌జెన్‌ ఒకడు. పదిహేడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకా అనేక మందిని తన పదవీ కాలంలో ట్రంప్‌ క్షమాభిక్షతో విడుదల చేశాడు. వారంతా ట్రంప్‌తో సంబంధాలు ఉన్నవారు, భవిష్యత్‌లో ఉపయోగపడతారనే ముందుచూపుతోనే చేశాడు. తాజా ఎన్నికల్లో ఉపయోగించు కున్నాడు. ట్రంప్‌ ఏర్పాటు చేస్తారని చెబుతున్న పేట్రియాట్‌ పార్టీ నమోదుకు ఆటంకాలు ఏర్పడతాయనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే కొందరు పేట్రియాట్‌ పార్టీ పేరుతో తమ ఉత్పత్తులకు ట్రేడ్‌ మార్క్‌ను నమోదు చేసుకున్నారు. 2007లోనే అలాంటి పార్టీ ఒకదానిని నమోదు చేసి ఉన్నారు. అయితే కార్యకలాపాలు లేకపోవటంతో పదేండ్ల తరువాత అది రద్దయింది. మూడు సంవత్సరాల క్రితం మరో రెండు నమోదయ్యాయి. వారు వదులుకుంటే ట్రంప్‌కు లభిస్తుంది లేకుంటే ఆ పేరుకు చట్టపరమైన ఆటంకాలు ఏర్పడతాయన్నది ఒక అభిప్రాయం. ట్రంప్‌ కుటుంబ సభ్యుల పేరుతో వెయ్యికిపైగా ట్రేడ్‌ మార్క్‌లు నమోదై ఉన్నాయి. ఒక వాణిజ్యవేత్తగా వాటి మంచి చెడ్డలు లేక చట్టపరమైన ఆటంకాలు ట్రంప్‌కు తెలియవని అనుకోలేము. ఒక వేళ ఆ పేరుతో పార్టీ ఏర్పడినా ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేక మీడియాలో ప్రచారానికి మాత్రమే వినియోగిస్తారా అన్నది కూడా తెలియదు.ఈ పేరుతో పాటు మూడవ పక్షం, కొత్త పక్షం అనే పేర్లను కూడా ట్రంప్‌ పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు బయటికి రాగానే పేట్రియాట్‌ పార్టీ పేరుతో ఇప్పటికే ఉన్న సామాజిక మాధ్యమ ఖాతాను అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆలూ చూలూ లేని ఈ పార్టీకి ఇప్పటికే కొందరు పార్టీ చిహ్నాలను కూడా పోస్టు చేస్తున్నారు. రాజధానిపై జరిగిన తీవ్ర హింసాకాండకు ట్రంపే బాధ్యుడని సెనెట్‌లో రిపబ్లికన్‌ పార్టీ నేతగా ఉన్న మిట్చ్‌ మెకనెల్‌ బహిరంగంగానే విమర్శించాడు. ఇతగాడు ట్రంప్‌ చివరి రోజుల్లో తీవ్రంగా వ్యతిరేకించాడని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ట్రంప్‌ను గుడ్డిగా సమర్ధించిన వారు కూడా మరోవైపు తారసిల్లారు. ఒక వేళ ట్రంప్‌ కొత్త పార్టీ పెడితే తొలుత రిపబ్లికన్‌ పార్టీతోనే వైరుధ్యాలు తలెత్తే అవకాశం ఉంది. కాలూనేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తే మొగ్గలోనే తుంచి వేసేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తారు. కొత్త పార్టీ ఏర్పడితే రిపబ్లికన్లు లేదా ట్రంప్‌ పార్టీ గానీ సమీప భవిష్యత్‌లో అధికారానికి వచ్చే అవకాశం ఉండదని చెప్పవచ్చు.
- ఎం. కోటేశ్వరరావు
సెల్‌: 8331013288

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే
మోడీ గారడీ!
విలువల చెలికాడు
లాటిన్‌ అమెరికాలో మరో వామపక్ష తరంగం !
జర చెప్పండి ప్లీజ్‌...
భూమి మనిషి సొంతమా?
భారత ప్రజాస్వామ్యం బతుకు పోరాటం చేయాలి
ప్రభుత్వ రంగాన్ని అమ్ముకుంటే రేపు పుట్టగతులుండవ్‌...
నిజమైన దేశభక్తుడు...
సంక్షోభాలు - సైన్స్‌ సమాధానాలు
జీవ రహస్యం
పైత్యం పీక్‌ స్టేజ్‌!
మాతృదేశం వీడారు.!
చివరకు బరిలోకి....
కార్పొరేట్‌ కబ్జాని అడ్డుకోవాలి
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
ఆవు.. అబద్ధాలు.. నిజాలు..
మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
హత్యలు.. న్యాయం.. రాజ్యం..

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.