Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 21,2021

ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి...

ఎంతో ఉత్కంఠతకు దారితీసిన హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎమ్‌సీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌... ఆఘమేఘాల మీద నగరంలోని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. గులాబీ దళపతి, తెలంగాణ గాంధీ అంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముద్దుగా పిలుచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన వారికి పుష్పగుచ్ఛాలిచ్చి సాదర స్వాగతం పలికారు. అభినందనలు, ప్రశంసల జల్లులతో ముంచెత్తారు. అనంతరం 'వినదగునెవ్వరు చెప్పిన' అనే టైపులో... 'పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో వ్యవహరించాలె. ఓపికతో, సహనంతో ఉండాలె... ఎట్టి పరిస్థితుల్లోనూ సహజత్వాన్ని కోల్పోవద్దు... వేష, భాషల్లో మార్పు అసలే రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడొద్దు... ప్రతీ ఒక్కరిని ఆదరించాలె.. అక్కున చేర్చుకోవాలె... వారికి సరైన గౌరవం ఇవ్వాలె...' అంటూ వారికి దిశా నిర్దేశం, మార్గదర్శనం చేశారు. సీఎం గారి సూచనలు, సలహాలను విన్న అధికార పార్టీ కార్పొరేటర్లు... 'ఆహా ఏం సెప్తిరి... ఏం సెప్తిరి...' అంటూ చప్పట్లు దంచి కొట్టారు. ఈ సూక్తి ముక్తావళి గురించి విన్న ఓ జూనియర్‌ జర్నలిస్టు, మరో సీనియర్‌ పాత్రికేయుడితో... 'గదేందన్నా... సీఎం సాబ్‌ గట్ల మాట్లాడిండు... పదవిలో ఉన్నవారు ఎంతో సంయమనంతోఉండాలె, ఓపికతో, సహనంతో వ్యవహరించా లంటుండు.. కానీ మీడియా సమావేశాలప్పుడు ఏ విలేకరైనా ప్రశ్న అడిగితే... తోక తొక్కిన తాచులా కస్సున లేచి, ఏ పేపర్‌బరు నీది...? ఏణ్నుంచి వచ్చినవ్‌...? అంటూ విరుచుకుపడతడు. అందరికీ సరైన గౌరవం ఇవ్వాలంటుండు... మరి శాసనసభలో, బయటా ప్రతిపక్షాల్ని ఇష్టమొచ్చినట్టు సూదులు, దబ్బనాల పార్టీలంటూ తిడతడు...? ప్రతి ఒక్కరినీ ఆదరించాలని చెబుతున్నడు... కానీ రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది, నిరుద్యోగుల గురించి అస్సలు పట్టించుకోవట్లేదు...?' అంటూ యక్ష ప్రశ్నలు వేశాడు. ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకూ జవాబు దొరకలేదు. వీటికి సమాధానాలు తెలిసీ మీరూ చెప్పలేదనుకోండి...? చందమామ పుస్తకంలోని బేతాళుడు, విక్రమార్కుడి కథ చదువుకోవాల్సిందే...

- బి.వి.యన్‌.పద్మరాజు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
హత్యలు.. న్యాయం.. రాజ్యం..
భవిష్యత్‌ రాజకీయాలపై రైతాంగ పోరాట ప్రభావం
ఎల్‌ఐసీ అమ్మకం చారిత్రక తప్పిదం
వాళ్లవల్లే.. మేమే గ్రేట్‌
అయ్యో దేవుడికెంత కష్టం!
ఎవరు కన్న బిడ్డరా.. ఎక్కి ఎక్కి ఏడ్చింది..
'న్యూస్‌క్లిక్‌'ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
త్యాగాల పాట..
ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పా భార్గవ
ఉద్యమ 'దిశ'
రాజే ద్రోహి
నూతన విద్యావిధానం - కార్పొరేట్లకు దాసోహం
ఎన్నికల అస్త్రంగా నేతాజీ!
కార్పొరేట్లకే రక్షణ బడ్జెట్‌
ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఆధునిక వర్గపోరాటం
వామపక్ష అణచివేతకు ఈక్వెడోర్‌ లో సరికొత్త కుట్ర?
భావప్రకటనా స్వేచ్ఛ - రాజకీయ హక్కు
ప్రశ్నించే వాడే స్పార్టకస్‌

తాజా వార్తలు

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

06:10 PM

26 భారత్‌బంద్‌కు సీపీఐ(ఎం) మద్దతు

05:54 PM

ఖమ్మం జిల్లాలో మహిళను లైంగికంగా వేధించిన కార్మిక నేత..

05:39 PM

మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.