Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆవు.. అబద్ధాలు.. నిజాలు.. | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 27,2021

ఆవు.. అబద్ధాలు.. నిజాలు..

భారతదేశంలో ఆవు చాలా పవిత్రమైన జంతువుగా పరిగణించబడుతోంది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఆవుకు సంబంధించి అనేక అశాస్త్రీయ అంశాలు ఆపాదిస్తు న్నారు. వాటిలో కొన్ని అంశాలు ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్నాయి. ఆ అశాస్త్రీయ అంశాలు, వాటిని ఖండిస్తూ... ప్రముఖ శాస్త్రవేత్త, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ మాజీ డైరెక్టర్‌, డాక్టర్‌ డి. బాలసుబ్రమణ్యన్‌ ఇచ్చిన వివరణలు ఇలా ఉన్నాయి.
ఆపాదించిన అంశం 1 : ఒక ఆవుకు ప్రతిరోజూ కొంత మోతాదులో విషం ఇవ్వడం జరిగింది. 24 గంటల తర్వాత ఆ ఆవు రక్తం, మూత్రం, పేడ, పాలు పరీక్షించబడ్డాయి. ఎక్కడో తెలుసా? న్యూఢిల్లీలోని 'ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌' (ఎయిమ్స్‌) పరిశోధనాశాలలో. ఇలా ఒక రోజు, రెండు రోజులు కాదు. 90రోజుల పాటు పరిశోధించడం జరిగింది. పరిశోధకులు ఆ ఆవు పాలు, రక్తం, మూత్రం, పేడలలో ఎక్కడా విషపు ఛాయలను కూడా కనుగొనలేకపోయారు. ఆ విషం ఎటుపోయింది? గో మాత విషం మొత్తాన్ని తన గొంతులో దాచుకుంది. ఏ ఇతర జంతువుకూలేని ప్రత్యేక లక్షణమిది! 'ఎయిమ్స్‌'లోని కొందరు బోధనాచార్యులను నేను అడిగి తెలుసుకున్న విషయమేమంటే... అక్కడ అలాంటి ప్రయోగమేదీ జరగలేదు. ఆ సంస్థకు చెందిన 'జంతువుల నైతిక విలువల కమిటీ' ఏ జంతువుకైనా ప్రయోగం కోసమైనా, ఒక్క రోజైనా విషం ఇవ్వడానికి అంగీకరించదని అక్కడి ఆచార్యులు నొక్కి వక్కాణించారు!
ఆపాదించిన అంశం 2 : ఈ భూమి మీద నివశించే జంతువులన్నింటిలో ఆవు ఒక్కటే ఆక్సిజన్‌ను పీల్చుకొని, ఆక్సిజన్‌ను విసర్జించగలదు. మొక్కలు మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరిపి, ఆక్సిజన్‌ను వదలగలవు. అంతేకాని, ఏ జంతువుకూ ఆక్సిజన్‌ను వదలగల శక్తి లేదు. అయితే, మనుషులు గానీ, జంతువులు గానీ పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌లోని కొంత భాగాన్ని నిశ్వసించే గాలితోబాటుగా వదులుతాయి. ఏ ఆవునైనా పరీక్షించినప్పుడు దాని నిశ్వాసంలోని గాలిలో కొంచెం ఆక్సిజన్‌ ఉన్నట్టు కనబడటానికి కారణం ఇదే. మనుషులను పరీక్షించినా వారి శ్వాసలోని గాలిలో కొంత ఆక్సిజన్‌ ఉన్నట్టు రుజువవడానికి కూడా కారణం అదే. నీటిలో మునిగిన వారిని బయటికి తీసిన తర్వాత నోటితో గాలిని ఊది ఆక్సిజన్‌ను అందిస్తారు.
ఆపాదించిన అంశం 3 : విషాన్ని విరిచే శక్తి ఆవు పాలకు ఉంది. విషం అనే పదం చాలా విస్తారమైనది. ఏ విషం? సయనైడా? డీడీటీనా? విషాన్ని ఆవు పాలు విరుస్తాయనే దానికి రుజువేమిటి? సైన్సుగాని, చట్టంగాని రుజువులేనిదే, దేనినీ అంగీకరించదు. రుజువు చేయలేని అంశాన్ని ఎలా రుజువుచేస్తాం? ఎలా ఖండిస్తాం?
ఆపాదించిన అంశం 4: ఆవు మూత్రం విషపూరితమైన సూక్ష్మక్రిములను చంపుతుంది. జంతువుది గానీ, మనిషిదిగానీ ఏ మూత్రమైనా బ్యాక్టీరియాను చంపుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దానికి కారణం కూడా తెలిసిందే. మూత్రంలో ఉండే ఎసిడిటీ (తక్కువ పీహెచ్‌ విలువ), అమ్మోనియం సంయోగ పదార్థాలు బ్యాక్టీరియాను చంపుతాయి. ఆవు మూత్రంలో వేరే ప్రత్యేకత ఏమీ లేదు (ఏప్రిల్‌ 2012 నాటి 'ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఫార్మాసుటికల్‌ రీసెర్చ్‌' అనే పత్రికలో ఎ. అహుజా సమర్పించిన పత్రం, 2(2): 84-87 నుంచి).
ఆపాదించిన అంశం 5 : నేల, గోడలూ ఆవు పేడతో అలికితే, రేడియో తరంగాల నుంచి మనల్ని కాపాడుతుంది. 'రేడియో తరంగాలు' అనేది విశాలమైన అర్థంతో కూడిన పదం. తరంగ దైర్ఘ్యం, శక్తి, తీవ్రత, ఫ్రీక్వెన్సీ లాంటివేవీ తెల్పకుండా రేడియో తరంగాల ప్రభావాన్ని చెప్పలేం. ఆవు పేడతో అలికినా, అలకక పోయినా రేడియో, టీవీలు క్షేమకరంగానే పని చేస్తాయి. అలాగే సెల్‌ఫోన్లు, వైఫైలు కూడా. అసలు ఇబ్బంది రేడియో తరంగాలను గూర్చి ప్రత్యేక స్పెసి ఫికేషన్లు పేర్కొనకుండా చేసే ప్రకటనలతోనే వస్తుంది.
ఆపాదించిన అంశం 6 : పది గ్రాముల ఆవు నెయ్యిని నిప్పుల్లో పోస్తే (యజ్ఞాలలో), ఒక టన్ను (1000 కేజీల) ఆక్సిజన్‌ వెలువడుతుంది. ఇది భౌతిక శాస్త్ర నియమాలకే విరుద్ధం. ఏ ప్రయోగంలోనైనా 10గ్రాముల పదార్థం 1000కిలోగ్రాముల పదార్థాన్ని సృష్టించలేదు. మన పూర్వీకులైన మునులెప్పుడో కనుగొన్న విషయాన్ని శాస్త్రజ్ఞులు భవిష్యత్తులో ఎప్పుడో రుజువులు కనుగొంటారనో, వాళ్ళ ప్రకటనలను వ్యతిరేకించేవారు హిందూ నమ్మకాలకు వ్యతిరేకులనో విమర్శించడం సరైన చర్య కాదు. సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న అశాస్త్రీయ అంశాలను సమర్థ వంతంగా ఎదుర్కోవడం దేశభక్తులందరి కర్తవ్యం.

- డి.బాలసుబ్రహ్మణ్యం  
'ది హిందూ' సౌజన్యంతో

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంచతంత్రంలో పారని మోడీమంత్రం!
క్రాంత దర్శి
తారా లోకం!
పాఠశాల విద్యలో వినూత్న పథకం ఎలా ఉండాలి..?
న్యాయవ్యవస్థే చట్టాన్ని ధిక్కరిస్తే...?
భాయీ భాయీ..
మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?
ఆన్‌లైన్‌ విద్యతో విద్యార్థులకు ఒరిగేదెంత?
ఉచిత వరాలతో అభివృద్ధి సాధ్యమా?
ప్రతిభ-అసమర్థత-రిజర్వేషన్లు
తమిళ అస్తిత్వంలో మార్పు..!
ఫూలే, అంబేద్కర్‌లు కులనాయకులా?
కాగ్‌ పట్టి చూపిన ఆర్థిక నిర్వాకపు మెతుకు
స్వీయహత్యల దోషులెవరు?
సుఖాంతమైన సూయజ్‌ ఓడ కథ..
ఐఎంఎఫ్‌ నిజ స్వరూపం
సార్వత్రిక ఆహార భద్రత కల్పించాలి
బత్తాయిలు... కరెంట్‌ షాక్‌
''ఉపా'' ఓ రాజ్యాంగ విరుద్ధమైన చట్టం
మధ్య తరగతిని చిత్తు చేసిన కరోనా మహమ్మారి
అన్నదాతల సత్యాగ్రహం
తిరుగులేని శక్తి...
అందరూ శుద్ధపూసలే...
నెటిజన్ల వైరల్‌
సుందరయ్య - వ్యవసాయ కార్మికులు
నిరుద్యోగానికి పరిష్కారమెప్పుడు..?
చివరిక్షణంలో ప్రత్యర్థుల ప్రచార బాంబు
ప్రకృతి శరణం గచ్ఛామి
భారత్‌, పాక్‌ సమీకరణల్లో అమెరికా పాత్ర
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయండి..

తాజా వార్తలు

10:19 PM

10ఓవ‌ర్ల‌కు హైద‌రాబాద్ స్కో‌రు 77/2

09:41 PM

జనసేనకు భారీ షాక్‌..!

09:16 PM

దంచికొట్టి‌న రాణా,త్రిపాఠి.. కోల్ క‌తా భారీ స్కో‌రు

09:06 PM

నిజామాబాద్ లో 190మందికి కరోనా పాజిటివ్

08:56 PM

అపోహలు నమ్మవద్దు: ఈటల

08:37 PM

తండా హరీష్ గౌడ్‌కు రామస్వామి పురస్కారం ప్రదానం

08:32 PM

కోరిక తీర్చుకున్నా‌డు..ముఖం చాటేశాడు

08:24 PM

కొవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్ కమిషనర్

08:15 PM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి : అఖిలపక్ష నేతలు

08:13 PM

జ్యోతి రావు పూలే విగ్రహ ఆవిష్కరణ

08:11 PM

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

08:10 PM

సెయింట్ ఆన్స్ చర్చ్ లో గురు పట్టాభిషేక మహోత్సవం

08:10 PM

రాష్ట్రం చిన్నదైనా క్రీడలకు అధిక ప్రాధాన్యత

07:55 PM

టీఆర్ఎస్ నేతకు ఈడీ సమన్లు

07:16 PM

న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పూలే జయంతి

07:11 PM

మాస్కు లేకపోతే రూ.1000 ఫైన్

07:00 PM

ఉలిక్కిపడ్డ తండా..

06:22 PM

అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

06:20 PM

మహబూబ్ నగర్ లో వ్యక్తి దారుణ హత్య..

06:17 PM

వెనక్కు తగ్గిన బీజేపీ.. సెంగార్ భార్యకు టికెట్ క్యాన్సిల్

06:15 PM

అమెరికాలో దారుణం.. ముగ్గురు పిల్లలను..

05:55 PM

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మళ్లీ ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

05:51 PM

కరోనా విజృంభణ..కేంద్రం కీలక నిర్ణయం

05:03 PM

రికార్డులు బ్రేక్ చేస్తున్న పుష్ప టీజర్

04:52 PM

నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు చిన్నారుల మృతి

04:39 PM

తమ్ముడిని కాల్చి చంపిన మూడేళ్ల బాలుడు..

04:28 PM

హైదరాబాద్‌లో కఠిన చర్యలు.. పోలీసుల వార్నింగ్

04:25 PM

త్రిపురలో బీజేపీకీ గట్టి షాక్.. కొత్త పార్టీ దూకుడు

04:14 PM

దొంగల ముఠా అరెస్టు..

03:57 PM

భార్య కాపురానికి రావట్లేదని సెల్ టవర్ ఎక్కిండు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.