Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోర్చుగీసు, డచ్, ఫ్రెంచి వారితోను, మరాఠాలతోను జరిగిన పోరాటాలలో, 1824లో జరిగిన బర్మా యుద్ధంలోను పాల్గొని 'బాంబ్ మెరైన్'గా పిలువబడిన సంస్థ 1830లో మెజిస్టీస్ నేవీగా మార్చబడింది. 1892లో 'రాయన్ ఇండియన్ మైరన్'గా 1934లో 'రాయల్ ఇండియన్ నేవీ'గా 26.1.1950 తర్వాత 'ఇండియన్ నేవీ'గా మారుతూ వచ్చింది. గోవా విముక్తి కోసం 'ఆపరేషన్ విజయ్' పేరుతో మొదటిసారిగా యుద్ధంలో పాల్గొంది. ఈ నౌకాదళం 4.12.1970న 'ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో కరాచీ రేపుపై విజయవంతంగా దాడిచేసింది. సాహసోపేతమైన ఈ పోరాటానికి గుర్తుగా ప్రతీ ఏటా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం జరుపుకుంటారు. మన నావికాదళానికి ప్రస్తుతం 175 యుద్ధ నౌకలున్నాయి. మైన్ స్వీపర్లు, ప్రిగేట్లు, డెస్ట్రాయిర్లు, ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లు వంటివి మన రక్షణ దళంలో ఉన్నాయి. ప్రతీ యేటా మన దేశంలోని విశాఖపట్నం, తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో నౌకా విన్యాసాలు అబ్బురపరుస్తాయి. విశాఖ సాగర తీరాన దాదాపు యాభై నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నట్టుండి ఒక్కసారి భీకర శబ్ధాలు, నావికాదళ హెలికాప్టర్లతో వాతావరణం అంతా టెన్షన్‌కి గురయ్యేలా విన్యాసాలు చేస్తారు. నౌకాదళ దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలల విద్యార్థులకు వివిధ రకాల ప్రతిభాపాటవ పరీక్షలు నిర్వహించి గెలుపొందిన వారికి నౌకాసిబ్బంది వారిచే బహుమతులు అందజేస్తారు. గుళ్లవర్షంతో పాటు, నావికా సిబ్బంది హెలికాప్టర్ల గుండా నడి సముద్రంలో ఉన్న నౌకపై దిగడం, నీటిలో చిక్కుకున్న వ్యక్తులను ఆదుకోవడం చూపరులకు గుగుర్పాటు కలిగిస్తుంది. నాడు భారత విజయానికి ప్రతీకగా నిలిచిన కుర్సుర జలాంతర్గామి నేడు మ్యూజియం రూపంలో పర్యాటకులను కనువిందు చేస్తున్నది. ఈ కుర్సుర 1971లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో దేశ గౌరవానికి, ప్రతిభా పాటవాలకు ప్రతిరూపంగా నిలిచి భారత్ విజయానికి ప్రతీకగా నిలిచింది. భారత్ పౌరుషానికి మారుపేరుగా, నావికా దళంలో విశేషమైన సేవలందించిన కుర్సుర సబ్‌మెరైన్ తయారీస్థాయి నుంచి ఇప్పటి మ్యూజియం రూపుదాల్చేవరకు ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకుని ప్రపంచదేశాల నావికాదళాల్లో ఏ యుద్ధ నౌకకూ జలంతర్గామికీ దక్కని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. భారత నౌకాదళ తొలి అడ్మిరల్ - ఆర్.డి. కఠారి, భారత నౌకాదళ ప్రధాన స్థావరం న్యూఢిల్లీలో ఉంది. భారత నౌకాదళ తొలి శిక్షణ నౌక - తరంగిణి. 1961లో భారత్ నౌకాదళంలో స్థానం పొందిన ప్రసిద్ధ నౌక - సి.ఎన్.ఎస్. విక్రాంత్. భారత నౌకాదళంలో పనిచేస్తున్న వారి సేవలు ఎనలేనివి.
- కామిడి సతీష్‌రెడ్డి,
జయశంకర్‌భూపాలపల్లిజిల్లా.