Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆకాశంలో సగం.. అవనిలో శవమై.. | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2019

ఆకాశంలో సగం.. అవనిలో శవమై..

నిర్భయల నిండు బతుకులు సీరియల్‌గా శిథిలమవుతుంటే...
ఆక్రందనలు వినిపించవు - పోలీసుల పహారాలు కనిపించవు
'అమ్మ'ను కాపాడుకునే భరోసా కనిపించదు.
ఇదేనా ప్రపంచీకరణ!
మానవ మృగాల పైశాచికత్వానికి తెలంగాణ ఉదాహరణ
తల్లిదండుల్ర కన్నీళ్ళు ఆగని సుడి - అగ్గితో కడిగినా ఆరని తడి
అమ్మా! అవనీ.. నా ఒళ్లంతా కోరలతో పుట్టించమని,
లేదా పుట్టుకతోనే ఆయుధాలు ఇమ్మని వేడుకుంటున్నా..
ఇలా ఎన్నేళ్ళు? కండ్లు మూసుకున్నా, తెరచినా భీభత్స దృశ్యాలే.. చెవులు మూసుకున్నా వినిపించేది ఆక్రందనలూ, ఆర్తనాదాలే. పీడనలు, వేదనలు కలిసి ఈ కాల చరిత్రను రక్తాక్షరాలతో రాస్తుంటే, ఇదొక అత్యంత విషాదకర అధ్యాయం. దీనికి అంతులేదా? అంతం కాదా? అరికట్టలేమా? చాప కిందకి చేరిన నీరులా ఈ సమాజంలోని అన్ని రంగాల్లోకి 'మాఫియా కల్చర్‌' చొరబడుతున్నది. దిశ దురంతంపై సిగ్గుపడదాం! విశ్వనగరంలో భద్రతెక్కడ అని ప్రశ్నిస్తున్న నెత్తుటి మరక. మానవత్వపు ఊట సాంతం ఎండిపోతే సాటి మనిషే యముడవు తుంటే ఎవరిని నమ్మాలి? భాగ్యనగరం భయంతో వణుకుతోంది. ఇలా ఎన్నాళ్ళు?
ఒక నిర్భయ అభయ, మానస, దిశ మొన్ననే.. వరంగల్‌ జిల్లా హన్మకొండలో తల్లి పొత్తిళ్ళల్లో నుంచి తొమ్మిది నెలల పసిగుడ్డును సైతం అఘాయిత్యానికి తెగబడి హతమార్చిన దురంతం సభ్య ప్రపంచాన్ని నిశ్చేష్ట పరిచింది. హైదరాబాద్‌ నగరాన ఏడాది వ్యవధిలోనే పసివాళ్ళపై అమానుష దాడులు సంఖ్య వెయ్యికి పైబడింది. యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్‌లో వరుస దురంతాలు వెలుగు చూసి ఆర్నెల్లు కాలేదు, ఆ వార్తా కథనాల సిరా తడి ఆరకముందే హైదరాబాద్‌ నగర శివారులో రంగారెడ్డి జిల్లా తొండుపల్లి టోల్‌ప్లాజాకు సమీపంలో పశువైద్యురాలు దిశను సామూహిక అత్యాచారం, హతమార్చిన తీరు సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నెత్తురు మరిగించింది. గుండెలవిసేలా చేసింది.
ఈ వరుస హత్యలు మన వ్యవస్థల పని తీరునూ, సమాజం పాటిస్తున్న విలువలనూ, ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2012లో నిర్భయ ఉదంతం అనంతరం అత్యంత కఠినమైన చట్టం వచ్చింది. పోక్సో చట్టంలో ఉరిశిక్ష సహా కఠిన శిక్షలు విధించడానికి వీలు కల్పించే సవరణ కూడా చేశారు. పురుషత్వాన్ని నిర్వీర్యపరిచే కెమికల్‌ చికిత్సల గురించి ఆలోచన జరిగింది. ఈ ఉద్రిక్తతను తట్టుకోవడానికి ప్రభుత్వం వర్మ కమిటీని వేసింది. ఆ కమిటీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే వ్యక్తి అర్హత నిర్ణయించటంలో ఉగ్రవాదం, అంటరానితనం, మతతత్వం, సతి కట్నం, వంటి నేరాలతో పాటు లైంగిక నేరాన్ని కూడా చేర్చాలని చెప్పింది. వీటితో పాటు తెలంగాణాలో ఆడపిల్లల రక్షణ కోసం 'షీ టీమ్‌'లు ఏర్పాటు చేశారు. ఆపదసమయంలో ఫోన్‌ చేయడం కోసం ప్రత్యేక ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ కనబడుతూనే ఉంది. అయినా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే గుర్తు తెలియని వాహనాలతో గుద్ది చంపుతున్నారు. ఇలాంటి నాయకులే... ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కండ్లల్లో నీళ్ళు పెట్టుకొని ఫోటో పోజులిచ్చేవారు నేరాలను అదుపు చేయడంలో తామెంత నిస్సహాయులుగా ఉన్నారో సూచిస్తున్నది. ప్రపంచంలో 400కోట్లు పోర్న్‌ వెబ్‌సైట్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. చైనా, ఉత్తర కొరియా, ఫ్రాన్స్‌, జపాన్‌ తదితర దేశాలు ఈ సైట్స్‌ను నిషేధించాయి. కానీ సంస్కృతి, సాంప్రదాయం అని చెప్పే ఈ దేశంలో పోర్న్‌ వెబ్‌సైట్‌ ఎందుకు నిషేధించడం లేదు. పోర్న్‌ సైట్‌లు కూడా ఇందుకు ఒక కారణం. అందుకే అడుగడుగున అత్యాచార రాక్షసాకారం కొమ్ములు కోరలతో విస్తరిస్తుంటే..? పాలకులారా! పోలీసులారా! బాధ్యత గురించిన మాటేమిటి? ఆడపిల్లలు తప్పిపోతే ఆచూకీ తెలుపండని ఫిర్యాదు చేసే తల్లిదండ్రులకు పోలీస్‌ స్టేషన్లలో ఎదురవుతున్న మాట. ''మీ అమ్మాయి లేచిపోయిందేమో అన్న ప్రశ్నే'' ఎదురైంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీస్‌ స్టేషన్‌ వెళ్ళాలంటేనే భయం, వణుకూ పుడుతోంది.
''పోలీసులు సకాలంలో స్పందించి వుంటే... మా బిడ్డ మాకు దక్కేది'' అని రోదిస్తున్న కుటుంబ సభ్యుల్ని ఓదార్చగలిగేది ఎవరు? పోలీస్‌ వ్యవస్థను ఇలాంటి బలహీనతలు కూడా పట్టి పీడిస్తున్నాయి. ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్ప, ఉన్నతాధికారవర్గ ఉరకలెత్తిస్తే తప్ప సామాన్యులకు న్యాయం జరగట్లేదు.
స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీలను భోగ వస్తువులుగా చూపించే సినిమా, టీవీ వంటి సాధనాలు, సాలెగూడు లాంటి ఇంటర్‌నెట్‌లో చిక్కి అంతర్జాల అసభ్య అశ్లీల చిత్రాలు ఆదాయంగా మలుచుకునే ప్రభుత్వం, విరివిగా మధ్యం అమ్మకాలు అసలు కారణాలు. వీటిని నియంత్రించకుండా, నిరోధించాలని అనుకోని ప్రభుత్వ విధానమే లైంగికదాడి నేరాన్ని పెంచిపోషించింది. ప్రపంచ వస్తువు సంస్కృతి వ్యామోహాలకు, స్వంత లాభం కోల్పోతున్న విద్యా ఉద్యోగ అవకాశాల వల్ల నిరుద్యోగులు, చిరుద్యోగులవుతూ స్వసుఖాల మరీచికల వెంబడి పరుగులు తీస్తూ నిరాశా, నిస్పృహలకు లోనవుతూ మరిచిపోవడానికి మద్యం తాగుతూ మత్తులో అడ్డుదారులు తొక్కుతున్న యువతరం తయారుకావడానికి పునాది ఈనాటి రాజకీయార్థిక విధానాల్లోనే ఉంది. సామాజిక హింసను చూసీచూడనట్టు వదిలెయ్యటం, హింసకు తక్షణ సాధనాలైన మనుషుల మీదికే కసిని కోపాన్ని మళ్ళించి మూలాల గురించి ఆలోచించకుండా చేయడం పాలకవర్గాల తక్షణ ప్రయోజనాలను ఈడేరుస్తోంది. కానీ ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదు. అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే శిక్ష ఒక్కటే మార్గం కాదు. దృక్పథం మారాలి. స్త్రీల పట్ల సామాజిక దృక్పథం నూతనంగా రూపొందాలి. స్త్రీని అంగడి సరుకుగా కాదు స్త్రీ ఒక మానవ వ్యక్తిగా సమానమైన వ్యక్తిగా గుర్తించి గౌరవించగల ఉత్తమ సంస్కారాలను అభివృద్ధిపరిచే ప్రయత్నం ఎవరు చేయాలి? ప్రభుత్వాలు కాదా?
లైంగికదాడుల పెరుగుదల రేటుకు సామ్రాజ్యవాద సంస్కృతి, మహిళల అక్రమ రవాణా పెరిగిందంటే... మహిళలను అమ్మకపు సరుకుగా, వారి శరీరాలను వ్యాపారంగా మార్చి, సొమ్ము చేసుకుంటున్న బేహారులున్నంత కాలం లైంగికదాడులు ఆగుతాయా? అధికారిక గణాంకాల ప్రకారమే రోజుకు 180మంది బాలబాలికలు అదృశ్యమైపోతున్న దేశంలో లైంగిక దాడుల ఉధృతి భీతిల్లచేస్తోంది. మద్యం దుకాణాలు, రాత్రి క్లబ్బులు, పబ్బుల యాజమాన్య వర్గం పాలకవర్గమేనన్నది అందరికీ తెలుసు. వీటన్నింటికీ వెన్నుదన్నుగా ఉన్న రాజ్యాన్ని నిలేయాలి. అత్యాచార నేరస్థులను శిక్షిద్దాం. కానీ... నేరం జరిగే అవకాశాలు పరిస్థితులను వదిలెయ్యటమా? నేరం జరిగే వరకు ప్రేక్షకుల వలే ఉండి నేరం జరిగాక నేరస్తుడినే శిక్షించటం వలన నేరాల సంఖ్య తగ్గించదు.
ముఖ్యంగా అత్యాచార ఘటనలపై బాధితురాలినే బాధ్యురాలిగా పరిగణిస్తూ.. బాధించే సంస్కృతి రమీజాబీ అత్యాచార సందర్భం నుంచి నిరసించబడుతూనే ఉంది. నాలుగు దశాబ్దాలు గడిచినా స్త్రీని చూసే చూపు మారలేదంటే మన అభివృద్ధి అంతా బలుపే కానీ... బలం కానే కాదు. మొదట బాధితులు చెప్పేది నమ్మండి.. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టాలి. నేరస్థులకు కఠిన శిక్షలు ఉండాలి. లైంగికదాడుల నేరాలకు మరణశిక్ష సమాధానం కాదు. లైంగికదాడులను అలవాటుగా మారుస్తున్న అధికార దౌర్జన్యాల ఆర్థిక లాభాపేక్షల దుష్ట సంస్కృతిపై యుద్ధం ప్రకటించాలి. కన్నీట తడిసిన ప్రశ్నల్ని కత్తుల్లా సంధిస్తూ నిలదీయాలి.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్‌: 9490098343




మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?

తాజా వార్తలు

06:32 PM

రైతులతో ముగిసిన 11వ విడత చర్చలు

06:28 PM

అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

05:12 PM

వాట్సాప్‌కు ఝలక్‌...

05:05 PM

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌

04:58 PM

బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి

04:39 PM

లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి

04:29 PM

పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

03:59 PM

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

02:56 PM

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.