Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రాస్ట్రంల ఉల్లిగడ్డల వాన | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

రాస్ట్రంల ఉల్లిగడ్డల వాన

నారదుడు తంబూర దీస్కుండు. చిర్తలు దీస్కుండు. ఒకసారి గవ్విటిని కొట్టి జూస్కుండు. యాడికి బోవాలె. యాడ్కి బోతె బాగుంటదని జెరసేపు సోంచాయించిండు. యాడికో ఎందుకు ఎప్పటితీర్గ యాద్గిరి గుట్టకు బోతె బాగుంటది. నర్సిమ్మసామితోని ముచ్చట బెడ్తె రాస్ట్రంలనే గాకుంట దేసంల ఏమైతున్నదో ఎర్కైతదని అనుకుండు. అనుకోని నారాయన నారాయన అన్కుంట చిర్తలు గొట్టుకుంట మొగులు మీదికెల్లి ఎల్లిండు.
నడిజామునాత్రి. సలిబెడుతున్నది. చద్దర్లు గప్పుకొని అందరు పండుకున్నరు. కొందరు కల్వరిస్తున్నరు. కుత్కెల దాంక మందు గొట్టిన ఒకడు సడక్‌ మీదనే సోయి లేకుంట బన్నడు. మప్లర్‌ సుట్టుకోని లాటి బట్కోని గూర్క గస్తి దిర్గుతున్నడు. దొంగతనం జేసెతందకు మోక కోసం ఒక దొంగ ఎదురు జూస్తున్నరు. పాల కోసం లేసిన సంటి పోరడు ఏడుస్తున్నడు. కొన్ని దుక్నాల కాడ గోదాంల కాడ లాటిలు; తుపాకులు బట్టుకోని కొంతమంది కావలి గాస్తున్నరు. నారదుడు గుట్టమీద దిగిండు. మాయమై గుల్లెకు బోయిండు. నర్సిమ్మ సామి ముంగట్కి బోయి-
''నారాయన; నారాయన'' అన్నడు.
''యాల గాని యాల వొచ్చినవేంది నారదా?'' అని నర్సిమ్మ సామి అడిగిండు.
''పగటీల మీరు పుర్సత్‌ లేకుంట ఉంటారమె. మీతోని ముచ్చట బెట్టెతందుకు నాకు మోక దొర్కదాయే''
''నా తోని ముచ్చట బెడ్తె ఏమొస్తది''
''ఏ మెర్కలేనట్లు అడుగతరేంది?'' మీతోని ముచ్చట బడ్తె రాస్ట్రంలనే గాకుంట దేసం ఏమైతదో ఎర్కైతది''
''రాస్ట్రంలనే గాకుంట దేసంలనే అందరు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అని కల్వరిస్తున్నరు''
''ఉల్లిగడ్డ బంగారమైందా?''
''బంగారం కన్న పిరమైంది. కొనెతందుకు బంగారం దొర్కుతున్నది. గని ఉల్లిగడ్డలు దొరుక్తలెవ్వు. ఇంతకు ముందు గది గావాలె. గిది కావాలె. అని మొక్కెటోల్లు గూడ గిప్పుడు వారం దినాలకు ఒక కిల ఉల్లిగడ్డలు దొర్కెటట్లు జెయ్యి దేవా అని నాకు మొక్కుతున్నరు. కొంతమంది ఒక ఉల్లిగడ్డ వొంతున నైవేద్యం బెడ్తున్నరు''
''మీకు ఉల్లిగడ్డ నైవేద్యమా?''
''అవ్‌. నాకు ఉల్లిగడ్డ నైవేద్యం బెట్టుమని కొందరు స్వామీజీలు జెప్పిండ్రు?''
''ఎందుకు జెప్పిండ్రు''
''ఉల్లి గడ్డ శంకం; చెక్రం గుర్తులుంటయని గాల్లు జెప్పిండ్రు. ఎట్లంటవా ఉల్లిగడ్డను అడ్డం గోస్తె లోపట చెక్రం గుర్తు గండ్ల బడ్తది. నిలువగ గోస్తె శంకం గుర్తు గడ్లబడ్తది. శంకం; చెక్రంలకు గుల్లు గట్టిచ్చి గవ్విట్కి పూజలు జేసెటోల్లకు ఉల్లిగడ్డలు దొరుక్తయని స్వామిజీలు జెప్పిండ్రు''
''ఉల్లిగడ్డలు దొర్కకుంటె జెనం ఏం జేస్తున్నరు''
''బజార్ల నూటయాబై, రొండు నూర్ల రూపాయలకు కిల ఉల్లిగడ్డలను అమ్మబట్టిండ్రు. ఇగ దాంతోని ఒక కుటుంబంల దినానికి ఒక్క ఉల్లి గడ్డనే దినబట్టిండ్రు. ఇంతకు ముందు ఉల్లి గడ్డలను గోస్తె జెనం కండ్లల్ల కెల్లి నీల్లు వొచ్చేటియి. గని గిప్పుడు ఉల్లిగడ్డలను గొంటె నీల్లు వొస్తున్నయి. ఇంతకు ముందు రూపాలను బేంకుల దాస్కునెటోల్లు గని గిప్పుడు బేంకుల ఉల్లిగడ్డలను దాస్కునేటోల్లు. వారానికి కిల ఉల్లిగడ్డలు కొన్కొచ్చెటోల్లనే పెండ్లి జేస్కుంటమని ఆడిపిల్లలు జెప్పబట్టిండ్రు. గీ నడ్మ కట్నం కింద రూపాలియ్యమని ఎవ్వరు అడ్గుతలేరు. రూపాలొంతకు ఉల్లిగడ్డ లియ్యమంటరు. ఉల్లిగడ్డ దొంగలు ఎక్వైండ్రు. దొంగలు రూపాలు; బంగారం ఎత్కపోతలేరు. ఉల్లిగడ్డలనే ఎత్కపోతున్నరు. ఆకర్కి పొలంల కెల్లి ఉల్లిగడ్డలను పీక్కోని పోబట్టిండ్రు. దాంతోని రైతులు ఒక్క తీర్గ లొల్లి బెడ్తె ఉల్లిగడ్డల పొలాల కాడ పోలీసోల్లను కావలి ఉంచబట్టిండ్రు. ఉల్లిగడ్డలు అమ్మేటి దుక్నాల కాడ బస్‌స్టేజిల కాడ రేల్‌ టేషన్ల కాడ ఉల్లిగడ్డల దొంగలున్నారు జాగ్రత్త అని రాసి ఉన్న బోర్డులు బెట్టిండ్రు''
''ఉల్లిగడ్డల కోసం లీడర్లు ఏం జేస్తున్నరు?''
''పార్లమెంటు లోపటనే గాకుంట అవుతల గూడ అపొజిసన్‌ లీడర్లు ఒక్క తీర్గ ఉల్లిగడ్డల మీద లొల్లి బెట్టబట్టిండ్రు. ఉల్లిగడ్డల దర మొగులు మీదికి బోయి జెనం తిప్పల బడుతుంటె బిజెపి లీడర్లు అడ్డగోల్గ మాట్లాడబట్టిండ్రు. ఉల్లిగడ్డల మీద లొల్లి బెట్టుడే గాకుంట అపొజిసన్‌ ఎంపీలు పార్లమెంటుకెల్లి వాకౌట్‌ జేసిండ్రు. ప్రతాన మంత్రి ఉల్లి గడ్డల కోసమే పారిన్‌ దేసాలకు బోయిండు. ఈ జిఫ్టు దేసం కెల్లి మన దేసంకు ఉల్లి గడ్డలు దెప్పిస్తున్నం. గవి రాంగనే ఉల్లిగడ్డల దరలు తక్వ అయితయని ఆర్తిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సబల అన్నరు. గామె గట్లనంగనే మీరు ఈజిప్టు ఉల్లిగడ్డలు దింటరా అని ఒక అపొజిసన్‌ ఎంపి అడిగిండు. నాకు ఉల్లిగడ్డలు; ఎల్లిగడ్డలు అంటె ఏందో నా కెర్కలేదు. నేను ఎప్పుడు గవ్విటిని సూడలేదు. నేనే గాదు మా కుటుంబంల గూడ ఎవ్వరికి ఉల్లిగడ్డలు ఎట్లుంటయో ఎర్కలేదు. ఉల్లిగడ్డలంటె ఏంటియో నాకెర్కలేనప్పుడు నేను గవ్విటిని తినేవాలే లేదు. నా లెక్కనే ఎవ్వరు ఉల్లిగడ్డలు దినొద్దు. ఉల్లిగడ్డలు దినకుండ బట్కె సంటర్ల నేను మంత్రినైన. ఉల్లిగడ్డలు దింటె మంచిది గాదని డాక్టర్లు అంటున్నరు. గవ్విటిని దింటె నర్కం బోతరని అయ్యగార్లు జెప్తున్నరు. అయిదు టన్నుల ఉల్లిగడ్డలు ఇస్తమంటె కొంతమంది లీడర్లు పార్టి ఫిరాయిస్తున్నరు. అని నిర్మలా సీతారమన్‌ అన్నరు. ఆర్తిక మంత్రికి ఉల్లిగడ్డలంటె ఎర్కలేదట. కమస్కం ఆలుగడ్డలంటె ఏంటియో ఎర్కెనా ఎర్కలేదా అని కాంగ్రెస్‌ ఎంపి చిదంబరం అడిగిండు. ఉల్లిగడ్డలను ఎన్నడు నేను తాక గూడ తాకలేదు. గసుంటప్పుడు గవ్విటి దరలు నాకెట్ల ఎర్కుంటయని సంటర్‌ మంత్రి అశ్వినీ చౌబే అన్నడు. ఉల్లిగడ్డలు తింటె నోరు కరాబైతది. నోట్లెకెల్లి చెడ్డ వాసనొస్తది. అని యుపి లీడర్‌ ఆజంకాన్‌ జెప్పిండు''
''తెలంగానల ఉల్లిగడ్డలు దొర్కతున్నయా?''
''తెలంగానల గూడ ఉల్లిగడ్డలు దొరుక్తలేవు. హోటల్లల్ల బిర్యాని తోని ఉల్లిగడ్డ పచ్చెలు ఇస్తలేరు. గవ్విటి వొంతు ఉల్లిగడ్డ పొట్టు ఇస్తున్నరు. ఆనియన్‌ దోసెలు పతాలేకుంట బోయినయి. ఆకర్కి పచ్చిపుల్సల గూడ ఉల్లిగడ్డ లేకుంట బోయింది. అందరు స్వామిజీలను బిల్సి యాద్గిరి గుట్టల ఉల్లియాగం జేస్తనని కెసిఆర్‌ జెప్పిండు. గా యాగం జేస్తె రాస్ట్రంల ఉల్లిగడ్డల వాన గురుస్తదని గాయిన అన్నడు''అని నర్సిసామి జెప్పిండు.
ఇంతల తెల్లారింది. నారదుడు మొగులు మీదికి బోయిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్‌: 9959150491




మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!
ధర్మం నడిచేది నాల్గు పాదాలమీద కానేకాదు!
అమెరికాలో అగంతక రాజకీయాలు
పదోన్నతులకు ప్రాతిపదిక ఏమిటి?
పదవీ విరమణ వయసు పెంపు
ఇది మరో జాతీయ పోరాటం
కేరళే ప్రత్యామ్నాయం
'మార్పు మనలోనూ రావాలి.!'
చైనాపై మాటలకుస్తీ.. మోడీ విదేశీ భక్తి..

తాజా వార్తలు

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

03:37 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..

03:20 PM

టీమిండియాకు కేసీఆర్, కేటీఆర్ అభినందనలు..

03:16 PM

సాగు చట్టాలు..వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయి : రాహుల్ గాంధీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.