Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
'మా పేరుమీద కస్టడీ హత్యలు వద్దు' | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 13,2019

'మా పేరుమీద కస్టడీ హత్యలు వద్దు'

దిశ కేసులోని నలుగురు నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేశారు. ఈ ఎన్‌కౌంటర్‌, ఎన్‌కౌంటర్‌ పేరుతో కస్టడీ హత్యకు ఉన్న అన్ని లక్షణాలను కలిగి ఉంది. ఆ రాత్రి లైంగికదాడి, హత్య జరిగిన స్థలానికి వారిని తీసుకొని వెళ్లినప్పుడు పోలీసుల మీద దాడి చేయటం వలన చనిపోయారని చెప్పారు. అనుమానితులు పోలీసు కస్టడీలో ఉండటం, ఆ కారణంగా వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండకపోవటం, పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇప్పుడు మనందరికీ న్యాయం జరిగిందని చెబుతున్నారు. బాధితురాలి హత్యకు ప్రతీకారం జరిగిందంటున్నారు. నిందితులు చనిపోయారు కాబట్టి పోలీసులు, ప్రభుత్వం, సమాజం సరిగ్గా ఉన్నాయని గట్టిగా నమ్ముతూ మనం అందరం మన మన పనుల్లోకి వెళ్లిపోవచ్చు. కానీ, ఈ న్యాయం నకిలీది. 'హత్యను' న్యాయంగా చూపించే వ్యవస్థ ఎలాంటిదంటే అది 'మహిళలకు వీధుల్లో భద్రత కల్పించలేం, మహిళలపై జరిగే నేరాలను విచారించి తప్పు రుజువు చేసేంత సాక్యాలను ప్రవేశపెట్టలేం, అత్యాచార బాధితులను రక్షించలేం (ఉత్తరప్రదేశ్‌లో ఒక లైంగికదాడి బాధితురాల్ని సజీవ దహనం చేశారు), అత్యాచార బాధితులకు కోర్టులో గౌరవం కల్పించలేమని' అని మహిళలకు చెబుతోంది.
వీళ్లు నలుగురు అనుమానితులే అనే విషయం మర్చిపోకూడదు. వీరు నిందితులని రుజువు చేసే సాక్ష్యం ఏమైనా ఉందో లేదో మనకు తెలియదు. ఈ ఒప్పుకోవడాలను భారతదేశంలో పోలీసులు అలవాటుగా హింస ద్వారా చేయిస్తారు. హింస ఎప్పుడు నిజాన్ని వెలికి తీయదు. కాబట్టి ఈ చనిపోయిన నలుగురు దిశను నిజంగా హత్య చేసి చంపిన వారు అవునో కాదో తెలియదు.
ఇదే హైదారాబాద్‌ పోలీసులు, తమ కూతురి సంగతి తెలుసుకొనే విఫల ప్రయత్నం చేస్తున్న బాధితురాలి తల్లిదండ్రులను ఎగతాళి చేశారు. మహిళలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెబుతూ ఈ పని చేశారు. అంటే మహిళలు రాత్రి 8 తరువాత బయట తిరిగితే, రహదార్లను భద్రంగా ఉంచి తాము వారిని రక్షించలేమని వారికి చెప్పారు. అదే పోలీసు ఇప్పుడు రేపిస్టులను పట్టుకొని శిక్షించామని మనల్ని నమ్మమంటున్నారు. వాళ్లే జడ్జిలుగా, న్యాయ సంఘంగా, తలారీలుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక క్రూరమైన జోకు.
మహిళా ఉద్యమాలు ఇది న్యాయం కాదని మొదటిగా చెబుతాయి. పోలీసులు, న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు, తమ బాధ్యత దారిని మూసివేసే కుట్ర ఇది. బాధ్యత తీసుకొని మహిళల హక్కుల విషయంలో తన ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి మన ప్రశ్నలకు జవాబు ఇచ్చే బదులు - పోలీసులు మూకదాడి హత్యలకు నాయకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి కస్టడీ మరణాలు తప్పదు అని వాదించేవారు ఇంకోసారి ఆలోచించండి. హైదరబాద్‌, తెలంగాణ పోలీసులు ఇలాంటి హత్యలకు చెడుగా ముద్రవేయబడ్డారు. వరంగల్‌ వేదికగా 2008లో స్వప్నిక, ప్రణితలపై యాసిడ్‌ దాడి కేసులో ముగ్గురిని కస్టడి హత్యకు గురి చేశారు. ఆ హత్యలు హైదారా బాద్‌, తెలంగాణ లేక భారతదేశంలో మహిళల మీద నేరాలను తగ్గించలేదు. యాసిడ్‌ దాడులు, లైంగికదాడులు, మహిళా హత్యలు ఎలాంటి శిక్షలు లేకుండా జరుగుతూనే ఉన్నాయి.
ఈ ఎన్‌కౌంటర్‌ విషయంలో పూర్తి విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ఎన్‌కౌంటర్‌కు బాధ్యులైన పోలీసులను అరెస్టు చేసి, విచారణ చేసి, కోర్టులో హత్యకు గురి అయిన నలుగురిని ఆత్మ రక్షణార్థం మాత్రమే చంపామని రుజువు చేసుకోమనాలి. ఇది మానవ హక్కులకే కాదు, మహిళల హక్కులకు కూడా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎలాంటి జవాబుదారీతనం లేకుండా, ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కోకుండా చంపగలగటం అంటే- వాళ్లు మహిళలను కూడా అత్యాచారం చేసి, ఎలాంటి ప్రశ్నలు ఉండవనే ధీమాతో చంపగలరు.
ఛత్తీస్‌ఘడ్‌లో మీనా కేసులో సంగతి గుర్తుకు తెచ్చుకోండి. ఆమెను ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు సామూహిక లైంగికదాడి చేసి చంపేశారు. జుడీషియల్‌ విచారణ అది లైంగికదాడి, హత్యను కవర్‌ చేసే ఎన్‌కౌంటర్‌ అని తేల్చింది. ఆ రేపిస్టుల మూక న్యాయ విచారణ ఇంకా ఎదుర్కోవాల్సి ఉంది. మేము ఈ కష్టడీ హత్యలను, మూక హత్యలను న్యాయంగా అంగీకరించం కాబట్టి చాలా టీవీ చానళ్లు, హిందూత్వ సామాజిక మాధ్యమ సైన్యాలు, మహిళా ఉద్యమకారుల్ని శత్రువులుగా చెబుతాయి. ఈ చానళ్లు, ఈ సైన్యాలే గతంలో కతువా కేసులో నిందితులను సమర్ధిస్తూ చేసిన ర్యాలీలను సమర్థించాయి. ఆ రేపిస్టులకు కోర్టులో శిక్ష పడిన తరువాత కూడా సమర్థించాయి. వీళ్లే ప్రధాన న్యాయమూర్తి గొగోయి మీద లైంగిక వేధింపు ఫిర్యాదు చేసిన మహిళను అబద్ధాలకోరు అన్నారు. వీళ్లే లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసిన జేఎన్‌యూ, జాదవ్‌ పూర్‌ విద్యార్థునులను అసభ్య భాషలో అవమానించారు. వీళ్లే గ్యాంగ్‌ రేప్‌ నిందితుడిగా ఉన్న కుల్దీప్‌ సెంగార్‌ను సమర్థించారు.
మేము, మహిళా ఉద్యమకారులం, మహిళలకు నిజమైన న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాం. మేము పోలీసులు వారి విధులను నిర్వర్తించాలనీ, మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని కోరుకొంటాం. వారిని జడ్జీలుగా, తలారీలుగా వ్యవహరించాలని కోరుకోము. పోలీసులు రేపిస్టులుగా ప్రకటిస్తూ హత్య చేసే పౌరాణిక 'సామూహిక చేతన'ను కోరుకోం. మేము మార్పు కోరుకొనే సమాజపు చేతనను ఆశిస్తాం. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో మహిళలకు అండగా ఉంటూ గౌరవంగా చూడటాన్ని కోరుకొంటాం.
- కవితా కృష్ణన్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?

తాజా వార్తలు

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

05:12 PM

వాట్సాప్‌కు ఝలక్‌...

05:05 PM

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌

04:58 PM

బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి

04:39 PM

లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి

04:29 PM

పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

03:59 PM

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

02:56 PM

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

12:44 PM

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..

12:34 PM

కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..

12:23 PM

సగం ఉడికిన చికెన్, గుడ్లు తినకండి : FSSAI

12:13 PM

డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్

12:07 PM

శివమొగ్గ భారీ పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.