Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూతలేదు.. కాతాలేదు
- పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్
- సీడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారికి వినతి
నవతెలంగాణ-రెంజల్
మండలంలో 2017-18 ఖరీఫ్‌లో సోయా విత్తనాలను రాయితీపై తీసుకుని పంటలు వేయగా అట్టి మొక్కలకు పూత, కాత లేదని బోర్గాం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారి సిద్దిరామేశ్వర్‌ను శుక్రవారం క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సీడ్ కంపెనీ మేనేజర్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట 20 నుంచి 30శాతం బెరుకులుగా (కల్తీలుగా) గుర్తించారు. సీడ్ కంపెనీ పంటనష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తూ వ్యవసాయాధికారి సిద్దిరామేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.