Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిచ్‌పల్లి
ఇందల్‌వాయి గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందల్‌వాయి తండాకు వెళ్లే దారిలో అటవీప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటితో రహదారికి ఇరువైపులా గుంతలు పడి వరిపంటలో మీటలు వేసింది. దీంతో రెవెన్యూ అధికారి అబ్దుల్‌వహీద్ అక్కడికి వెళ్లి పంటనష్టాన్ని అంచనా వేశారు. వర్షానికి రహదారి దెబ్బతినడంతో కల్వర్టులు లేక ఇరువైపులా పెద్దపెద్ద గుంతలు పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కల్వర్టుపై నుంచి నీరుపారుతుండటంతో రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలపై వెళ్లేటపుడు ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇంతజరుగుతున్నా ఇరిగేషన్, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ అధికారులు వచ్చి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణం చేసినా కల్వర్టు నిర్మించకపోవడంతో ప్రతిఏటా వర్షకాల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.