Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్చరిక బోర్డు ఏర్పాటు
మెండోరా : ముప్కాల్ మండల కేంద్రంలోని జీపీ పక్కనగల సర్వే నంబరు 310/2లో గ్రామ పంచాయతీ స్థలంలో ఎలాంటి పనులను చేపట్టొద్దని హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేశారు. అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఆపాలని, అనుమతి లేకుండా ఎవరైనా నిర్మాణం చేపడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు పేర్కొన్నారు. జిల్లా పంచాయితీ అధికారి ఆదేశాలమేరకు ఈ హెచ్చరిక (సూచిక)బోర్డు ఏర్పాటు చేశామని బాల్కొండ ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ విజరుకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సూర్యకాంత్, వీఆర్వో గంగాధర్, కానిస్టేబుల్ గంగాధర్, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.