Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా, వినతి
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని కోరుతూ శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. నెల 26న నగరంలోని అన్ని గణేష్ మండపాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. గణేష్ మండపాల కరెంట్ బిల్లును ప్రభుత్వమే భరించాలని, డీజే, సౌండ్ సిస్టమ్ కోసం చెల్లించే రుసుమును ప్రభుత్వమే భరిస్తూ, అందుకు అనుమతి నివ్వాలని డిమాండ్ ఏశారు. నగరంలోని రోడ్లను యుద్దప్రాతిపాదికన మరమ్మతులు చేయించాలని కోరారు. నగరంలోని అన్ని గణేష్ మండపాల విగ్రహాలు ఒకే చోట నిమజ్జనం చేసే విధంగా పదెకరాల స్థలాన్ని సేకరించి, చెరువు తవ్వించి సౌకర్యాలు కల్పించాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో శివకుమార్ పవార్, శ్రీనివాస్, బంటు గణేష్, ముక్క దేవేంధర్ గుప్తా, సతీష్ అటల్, ప్రకాష్, ధన్‌పాల్ సూర్య నారాయణ గుప్తా, న్యాలంరాజు, రవి, పిట్ల స్వామి తదితరులున్నారు.