Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
-తరగతులు బహిష్కరణ
నవతెలంగాణ-డిచ్‌పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలో స్పాట్ అడ్మిషన్లు తక్షణమే చేపట్టాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు శనివారం తరగతులు బహిష్కరించి అడ్మినిస్ట్రేషన్ భవానన్ని ముట్టడించారు. దాదాపు 152 సీట్లు మిగిలిపోయాయని వైస్ ఛాన్సలర్ అనిల్ కుమార్ చాంబర్‌లో కూర్చుని స్పాట్ నిర్వహించాలని నినాదం చేశారు. విసీ అనిల్ కుమార్ స్పందించి రెండు లేదా మూడు రోజుల్లో ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకుంటానని హామీనిచ్చారు. స్పాట్ అడ్మిషన్లు తొందరగా పెట్టకుంటే రాస్తారోకోలు నిర్వహిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. స్పాట్ అడ్మిషన్స్ పెట్టడం ద్వారా యూనివర్సిటీకి దాదాపు కోటి రూపాయల వరకు ఆదాయం ఉంటుందని విద్యార్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్ధి సంఘము నాయకులూ యోగేష్ ,శ్రీధర్,ప్రదీప్,రవి నాయక్, ఎండల ప్రదీప్,ప్రేమ్ సాగర్,తదితర విద్యార్థులు పాల్గొన్నారు