Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంఠేశ్వర్
తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హౌమ్ అసోసియేషన్ తానా నిజామాబాద్ జిల్లా శాఖ కార్యవర్గాన్ని 2019-20కి సంవత్సరానికి గాను ఎన్నుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఎన్నికల అధికారి సురేష్ కుమార్ సమక్షంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తానా జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ అజ్జ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా చక్రపాణి, మన్‌మోహన్ కల్యాణ్ పాడ్, కార్యదర్శిగా సంద శివ ప్రసాద్, సహాయ కార్యదర్శులుగా రామ్‌దాస్, బోధన్ నుంచి వి. శ్రీనివాస్, ఆర్మూర్‌నుంచి రన్వీర్, కోశాధికరిగా విక్రమ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా కె. రాజేశ్, టి. అనిల్‌కుమార్, గోవింద్, జలగం తిరుపతి రావు, పి. ఆనంద్, దీపక్ రాథోడ్, నవరతన్‌సింగ్, సూర్యారావ్, అరుణ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, నాగర్జునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ వైద్యులు మధుసూధన్, వినోద్ కుమార్ గుప్తా, సత్య నారాయణ, శ్రీశైలం, జీవన్ రావు, తానా నిజామాబాద్ వైద్యులు పాల్గొన్నారు.