Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
నవతెలంగాణ-రామారెడ్డి
విద్యార్థి జీవితం చాలా విలువైనదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యా లను అధిరోహించడానికి ఆత్మస్థైర్యం ఉండాలన్నారు. పిల్లలకు మానసిన వికాసం ఎంతో అవసరమని తెలిపారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరాలని సూచించారు. ఇంటర్ దశ చాలా కీలకమైందని, భవిష్యత్‌కు ఇక్కడే అడుగులు పడుతాయని చెప్పారు. విద్యార్థు లకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కళాశాలకు సీసీరోడ్డు నిర్మాణం, కంచె ఏర్పాటుకు తన నిధుల నుంచి రూ. 50వేలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ నిజాం మాట్లాడుతూ విద్యార్థులు గొప్పగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాం క్షించారు. కళాశాల అభ్యున్నతి కోసం నిధులు మంజూరు చేసిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో రిటైర్డ్ ఉద్యోగి పద్మ శ్రీనివాస్ నిర్మించిన వేదికను ఈ సందర్భం గా ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కా ర్యక్రమాలు అకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ నోట్ పుస్తకాలు అందజే శారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండబోయిన సంజీవ్, నోడల్ అధికారి డి. నా గరాజు, తహసీల్దార్ జయంత్‌రెడ్డి, ఎంపీడీవో రజిత రాజేందర్‌గౌడ్, ఉప సర్పంచ్ ప్రసాద్, కా మారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ సలాం, గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి. నరేందర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.