జన్నారం: గల్ఫ్ కార్మికుల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని మండలంలోని పొన్కల్ గ్రామపంచాయతీ గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు రాజుగౌడ్, మహ్మద్ సలీం, గంగన్న, అంజాగౌడ్, సతీష్ అన్నారు. మంగళవారం మండలంలోని పొన్కల్ గ్రామపంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న వారు మూడు నెలల నుంచి జీతాలు లేక తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారు తమ దేశానికి వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.15 వేలు కట్టాలని ప్రభుత్వం అనడం చాలా దారుణమన్నారు. గల్ఫ్ కార్మికులు స్వదేశానికి రావడానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలన్నారు. దీనికి సర్పంచ్ చొరవచూపి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు పంపే విధంగా కషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.