- ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు నవతెలంగాణ-జహీరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సేవలను ప్రారంభించడంతో ఆర్టీసీ సిబ్బంది తప్పని సరిగా మాస్కులు, హ్యాండ్ గ్లౌజులను ధరించాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు నామా సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్టు వారి సౌజన్యంతో మాస్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా మార్చి 22వ తేదీ నుండి నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తిరిగి ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రమేశ్, మాజీ ఎంపీపీ విజయకుమార్, నాయకులు నామారవికిరణ్, ఇస్రాయిల్ బాబీ తదితరులు పాల్గొన్నారు.