చలికాలం సాధారణంగా అందరినీ వేధించే సమస్య జలుబు. చిన్నారుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిల్లల ముక్కు బ్లాక్ అయినపుడు వారు పడే ఇబ్బంది ఎక్కువ. పిల్లలను ఆడు కొనివ్వకుండా, అలసిపోయేలా చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడి చిన్నారు లకు మందులు వేయడానికి బదులు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. - జలుబు పిల్లలను అలసిపోయేలా చేస్తుంది. పిల్లల్లో చికాకు పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా విశ్రాంతి ఇవ్వాలి. ఎక్కువగా సేపు నిద్రపోవడం ద్వారా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. - వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చటం వలన జలుబు త్వరగా తగ్గుతుంది. . గదిలో వాతావరణం చల్లగా ఉండకుండా చూడాలి. వేడి నీటితో స్నానం చేయించడంతో పాటు గోరువెచ్చని నీటిని తాగిస్తే మంచిది.