బస్, రైళ్లు, ఇంట్లో, బయట, ఆఫీస్‌లో... ఎక్కడ ఎవరిని చూసినా ఇయర్ ఫోన్స్ వాడుతూ కనిపిస్తున్నారు. వాటితో ఉపయోగాలు ఉన్నా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. హెడ్‌ఫోన్ వాడకం వల్ల చెవుల్లో తలెత్తే వేడి , తేమ బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఓ గంటపాటు హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటే ఆ సమయంలో బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతున్నట్టు ప్రయోగాల్లో తేలింది. అతిగా వాడితే అనారోగ్యం తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
- ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్నా ఎక్కువగా సౌండ్ లో మ్యూజిక్ వినేవారిలో చెవిలోని నరాల పై పొర మెలీన్ షీత్‌ను దెబ్బ తిం టుంది. ఈ పొర చెవి నుంచి శబ్ద తరంగాలను మెదడుకు చేరవేయటానికి ఉపయోగ పడుతుంది. ఈ పొర దెబ్బతింటే తాత్కాలి కంగా లేదా శాశ్వతంగా వినికిడి శక్తి దెబ్బ తింటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ, గంటకోసారి చెవులకు విశ్రాంతి ఇవ్వాలి.
- చెవుల లోపలికి దూరి ఉండే హెడ్ ఫోన్స్ వల్ల చెవి ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నెలకోసారి ఇయర్ బడ్స్ మారుస్తూ ఉండాలి. హెడ్‌ఫోన్స్, బడ్స్‌లను శానిటైజ్ చేస్తూ ఉండాలి.
- ఇతరుల హెడ్‌ఫోన్లు వాడుతూ ఉండే వారి చెవులను పరీక్షించినప్పుడు వాళ్లలో 98శాతం మంది చెవుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ప్రయోగాల్లో తేలింది.
Authorization