రోజులో కనీసం ఆరు, ఏడు గంటలు కూర్చోని పనిచేయడం తప్పని సరిగా మారింది. ఉద్యోగాలు చేసేవారే కాదు ఇంట్లో ఉండే వారు కూడా గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చోనే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పి, మెలనొప్పి రాకుండా నివారించే వీలు కలుగుతుందని సూచిస్తున్నారు. మరి కూర్చోవడంలో ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుంటే మేలు కదా..!
ఆఫీసుల్లో మెడ ముందుకు చాపి మానిటర్‌ని చూస్తూ ఎక్కువ సమయం ఉంటాం. ఇలాంటి సమయంలో శరీరంలోని అన్ని భాగాల కంటే తల, మెడ మీదే అధిక ఒత్తిడి పడుతుంది. దాంతో వెన్ను నొప్పి, మెడనొప్పి, దీర్ఘకాలంలో నడుము నొప్పి, మోకాలి నొప్పి వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే మానిటర్‌ను కంటి చూపు మేరకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.
- కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు, చేతులు నేలకు సమాంతరంగా ఉంచాలి.
- మెడను ముందుకు లేదా కిందకు ఎక్కువ టైమ్ చాపి ఉంచకూడదు.
- ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవద్దు. అరగంటకు ఒకసారైనా అటుఇటు కదలాలి.
- చాలామంది సెల్‌ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మెడ ఒకవైపు వంచి మాట్లాడుతుంటారు.
- ఇలా చేయడం వల్ల క్రమంగా మెడనొప్పి వస్తుంది.
- సెల్‌ఫోన్‌ను వాడేటప్పుడు తలను కిందకు వంచకూడదు. సెల్‌ఫోన్‌ను చేత్తో చెవి దగ్గర పెట్టుకునే మాట్లాడాలి, లేదా ఇయర్ ఫోన్స్ వాడాలి.
Authorization