శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావల్సిన విటమిన్లలో (ఎ,బి, సి,డి,ఇ, బి12,బి11....మొదలగునవి) ఏ ఒక్క విటమిన్ లోపించినా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. విటమిన్లలో ఆరోగ్యానికి, సౌందర్యానికి, సంతానోత్పత్తికి విటమిన్ ఇ ఎంతో అవసరం. మహిళల్లో గర్భాధారణకు, పురుషుల్లో వంధ్యత్వం నివారణకు విటమిన్ ఇ అవసరం- వ్యాధి నిరోధకతను పెంపొంధించుకోవడానికి విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.- విటమిన్ ఇ క్యాన్సర్ తో పోరాడే శక్తి కలిగి ఉంటుంది.- డయాబెటిస్ ను అడ్డుకుంటుంది. గుండెకు అండగా ఉండి కార్డియో వాస్కులార్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది.గ్రీన్ వెజిటేబుల్స్, బ్రొకోలి, ఆకుకూరలు, పండ్లు,నట్స్, పిస్తా ఆహారాల్లోనే విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.