వయసుతో పాటు శరీరభాగాలు అదుపు తప్పడం చాలా సాధారణం. అయితే అరవై, డెబ్బై ఏండ్ల తర్వాత రావల్సిన నిసత్తువ నలభై ఏండ్లకే వస్తుంటే మాత్రం ఆలోచించాల్సిందే. దానికి కారణాలు అనేకం...
మన శరీరంలో ప్రతి క్షణం జీవకణాలు క్షీణిస్తూ కొత్త కణాలు పుడుతుంటాయి. కొత్తగాఉత్పత్తి అయ్యే కణాల సంఖ్య కన్నా క్షీణించే కణాల సంఖ్య ఎక్కువ కావడం ఇందుకు కారణం కావచ్చు.
శరీరంలోని జీవ కణాలు ఉత్పత్తి కన్నా ఎక్కువ సంఖ్యలో వ్యర్థపదార్థాలు ఫ్రీ- రాడికల్స్, ఆక్సిడెంట్స్ తయారవుతాయి. అయితే వివిధ ప్రక్రియల ద్వారా వీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపే ప్రక్రియ జరుగుతుంది. అయితే యాంటి- ఆక్సిడెంట్ల వ్యాధి నిరోధక శక్తిని మించి, వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి, ఆహారం, మందుల రూపాల్లో అదనంగా మరికొన్ని యాంటీ ఆక్సిడెంట్లను ఇవ్వాల్సి ఉంటుంది.
జాగ్రత్తలు..
- మాంసాహారం బాగా తగ్గించాలి.
- మలబద్ధకం రాకుండా జాగ్రత్త పడాలి.
- ఆహారం మృదువుగా, సులభంగా నమిలే రీతిలో ఉండాలి.
- క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం రోజూ తీసుకోవాలి.
- చేపలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తరుచూ తీసుకోవాలి.
- ఆకలిని పెంచే సూప్స్ భోజనానికి ముందు ప్రత్యేకంగా తీసుకోవాలి.
- అవసరమైన మేరకు మంచి నీళ్లు తాగడంతో పాటు వ్యర్థపదార్థాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్లు గల ఆహార పదార్థాల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి.
Authorization