భోజనం చేస్తున్నప్పుడు, నీళ్ళు, జ్యూస్‌లు గబ గబా తాగుతున్నప్పుడు కొన్నిసార్లు వెక్కిళ్లు వస్తాయి. కొందరిలో క్షణాల్లో తగ్గిపోతాయి. కానీ, మరి కొందరిలో ఎక్కువ సేపు ఉంటాయి. అలాంట ప్పుడు వెక్కిళ్ళను ఆపడానికి కొన్ని చిట్కాలు.. ఆగకుండా వచ్చే వెక్కిళ్ళను ఆపడానికి కొద్దిగా ఐస్‌వాటర్‌ను నోట్లో వేసుకొని పుక్కిలించాలి. ఇలాచేస్తే కండరాలు అకస్మాత్తుగా పట్టేయడం తగ్గి, వెక్కిళ్ల సమస్య తగ్గుతుందని న్యూయార్క్‌కు చెందిన కార్డియాలజిస్టులు చెబుతున్నారు. -ఒక స్పూను చక్కెర నోట్లో వేసుకున్నా వెక్కిళ్ల నుంచి సత్వర ఉపశమనాన్ని ఇస్తుంది. - కొద్దిగా తేనె కలిపిన నీళ్లను నోట్లో కొద్దిసేపు ఉంచుకొని మింగాలి. - నిమ్మరసం వెక్కిళ్లు వచ్చినప్పుడు నిమ్మపండు కొరికి రసం తాగితే చాలు చిటికెలో ఉపశమనం లభిస్తుందని ఒక పరిశోధనలో వెల్లడయింది.