Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూరులో 16.2మిల్లిమీటర్ల వర్షం
- విరిగిన చెట్లు, నీట మునిగిన కాలనీలు
నవతెలంగాణ-తాండూరు
రంగారెడ్డి, వికారాబాద్ జిలాల్లో రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాండూర్‌లో 16.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలి పారు. యాలాలలో 5.0మిల్లిమీటర్లు, పెద్దేముల్‌లో 3.0, బషీరాబాద్‌లో 4.6, బోంరాస్‌పేట్2.0, కొడంగల్‌లో 2.6మిల్లీమీటర్లు, దౌల్తాబాద్‌లో 3.8మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తాండూర్ పట్టణంలోని పలు కాలనీల్లో వర్షపు నీ రు చేరి, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాలనీల్లో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో వర్షం కురిస్తే ఇండ్లలోకి నీరు చేరుతోంది. తాండూరు మున్సిపల్ పరిధిలోని గ్రీన్‌సిటి, సాయిపూర్ వార్డుల్లో నీరు ఉప్పొంగి ప్రవహి స్తోంది. నీరంతా ఇండ్లలోకి రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో సరైనా సౌకర్యాలు ఏర్పాటు చే యాలని పలుమార్లు అధికారులను నాయకులను వేడుకోం టున్న వారు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆయా వార్డుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాండూరులో లోతట్టు ప్రాంతాలను గుర్తించి మళ్లీ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయా వార్డుల ప్రజలు కోరుతున్నారు.