Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
పంచాయతీ అనుబంధ గ్రామాల్లో కూడా ప్రభుత్వ భూము లను గుర్తించాలని శంకర్పల్లి తహసీ ీల్దార్ కృష్ణకుమార్ అన్నారు. గురు వారం మండల పరిషత్ కార్యాల యంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనం కోసం అనుబంధ గ్రామాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించాలని వీఆర్వోలు, కార్యదర్శులకు సూచించారు. గ్రామాల్లో ఇద్దరు సమన్వ యంతో కలిసి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సత్తయ్య, ఎంపీఓ గీత, ఏపీవో నాగభూషణం తదితరులు ఉన్నారు.