Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కేశంపేట
బంగారు తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ నేపథ్యంలోనే గ్రామాల అభివృదివ్ధకి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లు అన్నారు. గురువారం కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి నుంచి కాకునూరు మీదుగా లేమామిడి వరకు బీటీ లింక్‌రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కాకునూరు గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ మారుమూల గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యపాత్ర వహించాల న్నారు. త్వరితగతిన లింకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, ఎంపీపీ వై. రవీందర్ యాదవ్, షాద్‌నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ లక్ష్మీనారాయణగౌడ్, ప్రసూన్ కన్ స్ట్రక్షన్స్ ప్రొప్రైటర్ యెన్నం గోపాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మమ్మ, వెంకట్ రెడ్డి, నవీన్ కుమార్, ఎంపీటీసీ రమాదేవి, టీఆర్ ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, నాయకులు శ్రావ ణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖర్ రెడ్డి, రాఘ వేందర్, శేఖర్ పంతులు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.