Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతంత మాత్రంగానే నాణ్యత ప్రమాణాలు
ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ పనులు ముందుకు సాగడం లేదు. ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. అధికారులు, మంత్రుల మాటలు నీటి ముటలుగానే మిగులుతున్నాయి. పనులు నత్తనడకన తలపిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలూ పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యతను పాటించి, సమస్యలు లేకుండా పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి
భగీరథ పనులు సాగే విధానాన్ని చూస్తే.. ఎప్పుడో కావాల్సిన పనులు ఇప్పటికీ టార్గెట్ చేరుకోలేదు. దీంతో జిల్లా మంత్రి మరో సారి సమీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంకెల్లో అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపించినా..అంత తేలిగ్గా ఇప్పట్లో పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్న అనుమానులు వస్తున్నాయి. దీంతో ఇంటింటికి నీళ్లిస్తేనే ఓట్లు అడుగుతామన్న అమాత్యుల మాటలు నీటి మూటలుగా మిగిలాయన్న విమర్శలు ఉన్నాయి. ఇక పోతే జరిగిన పనుల్లోకూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న వాదనలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో పైపు లైన్లు రిపేర్‌లో ఉండడంతో నీరు రోడ్లపైకి వస్తున్నాయని తెలుస్తోంది. వర్షాకాలం కావటంతో గుంటల్లో ఆగిన మురుగు నీరు తిరిగి పైపు లైన్ల ద్వారా తాగు నీటిలో సరఫరా అవుతున్నట్టు అనేక గ్రామాల్లో నీటి వినియోగ దారులు చెబుతున్నారు.
పథకం లక్ష్యం..
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సురిక్షితమైన తాగు నీరు ఇంటింట అందించడానికి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇది చాలా ప్రతిష్టాకమైన కార్యక్రమంగా చెప్పుకుంటున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో 1062 ఆవాసాలు ఉన్నాయి. వీటికి సురక్షితమైన నీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం పని ప్రాంరంభించింది. అయితే జిల్లాలో ఉన్న శ్రీశైలం సెగ్మెంట్‌కు ప్రభుత్వం నుండి జీఓ ఆర్టీ నెం 392 ద్వారా 76500.00 లక్షలు మంజూరయినవి. అయితే అందులో 58500 మేర పనులను చేసి ఖర్చు చూపిస్తున్నారు. అలాగే..ఎల్లొర్ సెగ్మెంట్‌నకు ప్రభుత్వం జీఓ నెం336 ద్వారా 234500.00 లక్షలు మంజూరయితే.. అందులో149365.00లక్షల ఖర్చుతో పనులు అయినట్లు తెలుస్తోంది. అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉన్న ముడి నీటిని ఎల్లోర్ రిజర్యాయరు ద్వారా రంగారెడ్డి జిల్లాలో ఉన్న నాలుగు ప్లాంట్లకు (ముచ్చెర్ల, అంతారం,కమ్మదనం, కల్వకుర్తి) ద్వారా అన్ని ఆవాసాలకు శుద్దమైన మంచినీటి సరఫరా చేయాలన్న లక్ష్యం నత్తనడకన సాగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇంకా 6366కిలోమీటర్ల పొడవులో ఇంకా పనులు జరగాల్సి ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంతే గాకుండా ఆరంజ్, రెడ్ గ్రామాలు ఇంకా 400 గ్రామాలకు పైగా ఈ నీరు అందడం లేదని తెలుస్తోంది. ఇకపోతే అనేక అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన తాగు నీటి సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది.