Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌ఎస్‌యూఐ నాయకులు
నవతెలంగాణ-పరిగి
డిగ్రీ, బీటెక్, బిఫార్మసీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గౌస్ సదన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పరీక్షలు రద్దు చేయాలని, అక్రమ అరెస్టులను ఆపాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌస్ సదన్ మాట్లాడుతూ ఒక పక్క కరోనా విజృంభిస్తుంటే రోజుకు పదుల సంఖ్యలో మరణాలు అవుతున్నాయని అన్నారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల పరీక్షలు నిర్వహిస్తే వారి ప్రాణాలకే ప్రమాదం అని అన్నారు. ముం దుగా విద్యార్థులను ప్రమోట్ చేసి రాష్ట్రంలో కరోనా టెస్టులు అధిక సంఖ్యలో పెంచి రాష్ట్ర ప్రజలను ప్రతి ఒక్కరిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్‌ఎస్‌యూ, అన్ని విద్యార్థి సంఘాలతో, యు వజన సంఘాలతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆం దోళనలు, ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.