Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కురుస్తున్న వర్షాలతో రెండు మార్గాల్లో కొట్టుకపోయిన బ్రిడ్జిలు
ఇబ్బందుల్లో ప్రజలు ,ప్రయాణికులు
నవతెలంగాణ-తాండూరు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాండూరు రాకపోకలు పూర్తిగా స్తంభించి పొయ్యాయి. తాండూరుకు ఉన్న రెండు మార్గాల్లో బ్రిడ్జిలు కొట్టుకపోయ్యాయి. మొదట తాండూరుకు ప్రధాన రోడ్డు మార్గంలో మంచన్‌పల్లి గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకపోయింది. దీంతో తాండూరుకు వెళ్లేందుకు పేద్దేముల్ మీదుగా నాగసం ముందర్ గ్రామం నుండి ప్రయాణికులు వెళ్తున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షంతో అక్కడ ఉన్న బ్రిడ్జి కూడా కొట్టుక పోవడంతో తాండూరుకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అటు పొయ్యే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాండూరు-హైదారాబాద్ రోడ్డు మార్గంలో రోజు వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. 20రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మంచన్‌పల్లి గ్రామం దగ్గర ఉన్న బ్రిడ్జి పూర్తిగా కోట్టుక పోవడంతో అటు నుండి రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. తాండూరు పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో రోడ్డంతా గుతంల మయంగా మారింది. అటు నుండి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంచన్‌పల్లి బ్రిడ్జి కొట్టుకపోవడంతో హైదరాబాద్, వికారాబాద్ వెళ్లాలంటే పెద్దేముల్, నాగసముందర్, గ్రామాల మీదుగా ధారూర్‌కు వెళ్తున్నారు. అక్కడ కూడా రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వాహదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వారాలు గడుస్తున్న మంచన్‌పల్లి దగ్గర ఉన్న బ్రిడ్జిని బాగు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి మంచన్‌పల్లి బ్రిడ్జిని బాగు చేయాలని కోరుతున్నారు.