Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆందోళన చెందుతున్న రైతులు
పశు వైద్యశాలని సందర్శించిన మున్సిపల్
చైర్మెన్ జగదీశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ మండలంలోని పశువులకు లంపిస్కీన్ సోకిన పశ ువు చర్మంపై కాయలు పశువుల్లో కొత్తరకం వైరస్ వ్యాధి సోకింది. పశువులు లంపిస్కిన్ వ్యాధి బారిన పడటాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మెన్ జగదీశ్వర్ రెడ్డి పశు వైద్యశాలను సందర్శించి వ్యాధి వివరాలను వెటర్నరీ అసిస్టెంట్ ఉషా రావును అడిగి తెలుసుకున్నారు. పశు వైద్య అధికారులు అందుబాటులో ఉండి పశువులకు సమయానికి వైద్యం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఉషా రావు వెటర్నరీ అసిస్టెంట్ మాట్లాడుతూ లంపి స్కిన్ బారిన పడి పశువులు పడుతున్నాయన్నారు. ఇది ఒక పశువు నుంచి మరో పశువుకి త్వరగా వ్యాపిస్తుందని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి ఇటువంటి కేసులు పశువుల ఆస్పత్రులకు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా ఆవులు, ఎద్దులలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఒకపక్క ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంటే పశువుల్లో ఈ కొత్త వైరస్‌తో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారన్నారు. ఈ వైరస్ వల్ల పశువులకు శరీరంపై భయంకర కణతులు, పుండ్లు రంధ్రాలు వచ్చి తీవ్ర రక్తస్రావం అవుతుంద న్నారు. పశు వైద్య అధికారులు ఏదో ఒకటి చేసి ఈ వైరస్ ప్రబలకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ వైరస్‌కు ఎలాంటి మందు లేదని పశు వైద్య అధికారులు అంటున్నారు. పశువులలో వ్యాధి నిరోధకత తక్కువ ఉండడం వలన ఈ వైరస్ సోకుతుందన్నారు. లంపి స్కిన్ వ్యాధి సోకినప్పుడు పశువులకు కాలువాపు, జబ్బా వాపు వచ్చి ఇబ్బంది పడతాయని తెలిపారు. పశువుల చర్మంపై కాయలు కాచి వారం నుంచి పదిహేను రో జులు ఉంటాయని, యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమిన్స్ వాడటం వల్ల తగ్గుతుందని అన్నారు, కాళ్లు ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటుందని, ప్రాణాపాయం లేకపోయినా మేత తిన డం తగ్గించేస్తాయి. దీనివల్ల పశువులు నీరసించి పోతాయి. దోమ లు, ఈగలు, గాలి ద్వారా వ్యాపించడంతో త్వరగా పశువుల అన్నింటికీ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. రైతులు వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే పశువులకు బలహీనతకు గురవుతుం దన్నారు. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే రైతులు తమ పశువులను పశు వైద్యశాలకు తీసుకువెళ్లి వైద్యుడు ద్వారా చికిత్స చేయించాలి. వైరస్ దాడితో పశువులు ప్రాణాల కోసం పోరాడ వలసిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం ముందస్తుగా పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకుడు మిఠాయి రాజు, విజరు కుమార్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.