Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య
నవతెలంగాణ- వికారాబాద్ డెస్క్
సాలిండా పూర్ గ్రామ పంచాయతీ పరిధి లోని మాల కుంట తండాకు చెందిన లక్ష్మీబా యికి 10 గుంటల పట్టా భూమి సాయి బోరును అక్రమణకు సహకరించి, బాధితులపై అక్రమ కేసులు పెట్టిన బొంరాస్‌పేట ఎస్‌ఐ వెం కటశ్రీనును వెంటనే సస్పెండ్ చేయాలనీ వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరులతో వ్య వసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హ క్కుల జిల్లా అధ్యక్షులు చెంద్రయ్య మాట్లాడుతూ సాలిముండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ని మాలకుంట తండాకు చెందిన లక్ష్మిబాయి భర్త పేరుపై సర్వే నెంబర్ 55లో 4-00ఎకరాల పట్టా భూమి ఉందని తెలిపారు. ఇందులో1-00 ఎకరం భూమి ప్రభుత్వ ఇండ్ల స్థలాల ఇవ్వగా1-00ఎకరం భూమి అదే గ్రామనికి చెందిన దేవిబాయికి బతుకడానికి పూర్వం ఇచ్చారనీ తెలిపారు. మిగిలిన 2-00ఎకరాల భూమిలో లక్ష్మీబాయి కాస్తులో ఉండగా ఆ రెండు ఎకరాల భూమిలో మే నెలలో లక్ష్మీబాయి వ్యవసాయ కొత్త బోర్ వేసినట్టు వివరించారు. లక్ష్మీ బాయి భూమిలోకి 2020 జులై 27 న దేవి భారు పది గుంటల భూమి ఇప్పుడు ఆక్రమించుకునేం దుకు ట్రాక్టర్ తీసుకొని రాగా తమ పొలంలో ఎందుకు దున్ను తావు అని లక్ష్మిబాయి అడుగగా 'దున్నుతాం నీకు ఎవరు దిక్కుంటే వారికీ చెప్పుకోండి' అని దౌర్జన్యంగా భూమిని ఆక్రమించారని తెలిపా రు. తమకు అన్యాయం చేయండని లక్ష్మిబాయి ఎసై కి ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని బూతులు తిట్టి ఫిర్యాదు తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో రాత్రివరకు కూర్చోబెట్టి, బాధితులపైనే కేసు నమోదు చేసి బాధితులను భయబ్రాంతు లకు గురి చేసి అక్రమ దారులకు అండగా ఉన్నాయని తెలిపారు. నాయకులు వెంకట్ నారా యణ, వెంకటయ్య, బాధితులు చందు, గోపాల్ తదితరు పాల్గొన్నారు.