Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పత్తిపైనే ఆశలు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 15,2020

పత్తిపైనే ఆశలు

జల్లులు కురుస్తున్న సాగని వరి
చెరువులు, కుంటల్లోకి చేరని నీరు
ఇక తెల్ల బంగారంపైనే ఆశలన్నీ
జిల్లాలో పెరిగిన పత్తి పంట సాగు విస్తీర్ణం
దిగుబడిపై భారీ ఆశలు
చీడపీడల నివారణకు కరువైన సూచనలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా నియంత్రిత పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో పత్తి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. గతేడాది కంటే ఈ సారి ఎక్కువగా పత్తి పంట సాగవుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు చేసిన పత్తి పంట ఏపుగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చీడపీడల బెడద పెరుగుతోంది. నివారణకు అవసరమైన మందులను రైతులు పిచికారి చేస్తున్నారు. దీంతో అన్నదాతలు దిగుబడిపై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. తమ కష్టానికి అనుగుణంగా ధరలు నిర్ణయించాలని, ప్రభుత్వమే పండించిన పత్తిని కొనుగోలు చేస్తే ఆశించిన లాభాలు అందుతాయంటున్నారు. కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఏర్పాటు చేస్తే రవాణా భారం తగ్గుతుందని రైతులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పత్తిపంటపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం.
ఎక్కడ చూసినా.. జిల్లాలో ఈ ఏడాది పత్తి
పంట 62,805 ఎకరాల్లో సాగు చేశారని అధికారులు అంచనా. అధికారికంగా గతేడాది జిల్లా వ్యాప్తంగా 87,423 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన వివరాల ప్రకారం 62,805 ఎకరాల్లో సాగు చేశారు. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా పత్తి పంటనే కనిపిస్తోంది. వరి, మొక్కజొన్న పంటలను సాగు చేయొద్దని అధికారులు ముందస్తుగా సూచించడంతో వాటికి బదులుగా పత్తిని సాగు చేశారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అవసరం..
రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలోనే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులపుకుంటున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే మూతపెడుతున్నారు. దాంతో రైతులు మధ్యదళారుల చేతుల్లో మోస పోతున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం డివిజన్‌లో సాగు చేసిన పత్తిని విక్రయించుకోవాలంటే ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాన్ని సంఘీ జిన్నింగ్‌ మిల్లులో విక్రయించాలని చెబుతుండటంతో దూరభారం పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, కందుకూర్‌, మహేశ్వరం మండలాలకు చెందిన రైతులు తమ పత్తిని విక్రయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షాద్‌నగర్‌ డివిజన్‌లో మూడు జిన్నింగ్‌ మిల్లులైన షాద్‌నగర్‌ డివిజన్‌ కేంద్రం, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, అమిత్‌ కాటన్‌మిల్లు, విష్ణు జిన్నింగ్‌ మిల్లులో ఏర్పాటు చేస్తుండటంతో రైతుల రద్దీ అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఉమ్మడి మహాబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌, నారాయణపేట, మహాబూబ్‌నగర్‌, నవాబ్‌పేట, బాలానగర్‌, పరిగి, దోమ మండలాల నుంచి కూడా షాద్‌నగర్‌ కొనుగోలు కేంద్రాలకు పత్తి విక్రయాలకు వస్తుంటాయి, దాంతో రద్దీ అధికంగా ఉంటుంది. దాంతో పత్తి విక్రయానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఏడాది దిగుబడి సైతం ఎక్కువగా ఉంటుందని మండలాల వారిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకు మేలు జరుగుతుందని పలువురు రైతులు అభిప్రాయ పడుతున్నారు.
తగ్గిన వరిసాగు..
జిల్లాలో వరి సాగు గణనీయంగా తగ్గింది. సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో వరి సాగుకు నోచుకోలేదు. ఈ సారి వరి సాధారణ విస్తీర్ణం 36వేల హెక్టార్లు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ కేవలం 200 ఎకరాలు కూడా సాగుకు నోచుకోలేదు. అందుకు సమృద్ధిగా వర్షాలు లేకపోవడమే కారణం. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పత్తి, కంది, జొన్న, పెసర్లు మినుముల, ఆముదం, వేరుశనగ, ఇతర కూరగాయల పంటలకు మేలు కలుగుతుంది. కానీ వరి పంట సాగుకు అవసరమైన భూగర్భజలాలు పెరగలేదు. పైగా చెరువులు, కుంటలు, బోరు బావులు నీరు వెలవెలబోతున్నాయి. గత ఏడాది మాదిరిగానే యాసంగి పంట మాత్రమే పండే అవకాశాలున్నాయి.
జిల్లాలో వానాకాలం సాగు...
జిల్లాలో వానాకాలం పంటల సాగును పరిశీలిస్తే.. మొత్తం 3,99,561ఎకరాల్లో పంటల సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటిలో పత్తి సాగు248,357ఎకరాల్లో సాగు చేస్తారని బావిస్తే, 62,805 ఎకరాల్లో సాగు చేశారు. ఇక వరి 36,000 ఎకరాలకు సుమారు 200 ఎకరాలు కూడా సాగుకు నోచుకోలేదు. ఇక కందులు 82,554 ఎకరాలు సాగు అంచనా వేయగా, 6వేల ఎకరాల వరకు సాగు చేశారు. జొన్న 27,077ఎకరాలకు 5వేలు, పెసర్లు 373ఎకరాలకు 200 ఎకరాల వరకు, ఇతర పంటలు 4,691ఎకరాలకు 12వందల ఎకరాల వరకు సాగు చేశారు.
జిల్లాలో వర్షాపాతం...
జిల్లాలో సాధారణ వర్షపాతం 694.6మిల్లీ లీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 394.7మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం జిల్లాలో అత్యధికంగా కేశంపేట మండలంలో 15.8మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శంషాబాద్‌లో 6.8మిల్లీమీటర్లు నమోదు చేసుకుంది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో వర్షం నమోదైతే చెరువులు, కుంటల్లోకి నీరు చేరే అవకాశాలున్నాయి. తద్వారా ఆలస్యంగానైన వరిని సాగు చేసే అవకాశాలున్నాయి.
కేంద్రాలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం
మండలాల వారీగా పత్తి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దూర భారాన్ని మోస్తూ ఎక్కడ జిన్నింగ్‌ మిల్లులు ఉంటే అక్కడికి తీసుకుపోయి రోజుల తరబడి అక్కడే ఉండి పండించిన పం టను విక్రయించాల్సి వస్తోంది. వరుస పద్ధతిలో జరిగే కొనుగోళ్లతో సమయం వథాతో పాటు సరైన ధర పలకక తీవ్రంగా నష్టపోతున్నాం. సంబంధిత శాఖ ఉన్నాతా ధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రతి మండల కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
రాజిరెడ్డి, రైతు, మేడిపల్లి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

తాజా వార్తలు

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

01:03 PM

పెండ్లి అయిన కొన్ని గంట‌ల‌కే విషాదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.