Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినందించిన సీపీ సజ్జన్నార్
నవతెలంగాణ-గండిపేట్
కరోనాతో వణికిస్తున్న తరుణంలో వ్యాధిని అంతం చేసేందుకు ముందుకు రావాలని నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి అన్నారు. కరోనా సోకి తగిన వారు ప్లాస్మాను దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. బుధవారం సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ పిలుపుతో నార్సింగి ఎస్‌ఐ ప్లాస్మాను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ వ్యాధి సోకిన వారు ఆందోళనకు గురికావొద్దన్నారు. కరోనా నయం అయిన తర్వాత ప్లాస్మా దానం చేయాలని తెలిపారు. ప్లాస్మాను దానం చేసేందు ఎక్కువ మంది ఉత్సహాం చూపుతున్నారని తెలిపారు. సీపీ పిలుపుతో సికింద్రాబాద్‌లోని యశోధ అస్పత్రిలో ప్లాస్మాను ఇచ్చినట్టు తెలిపారు. సీపీ సజ్జనార్, శాస్త్రవేత్తలు నడుమ ఎస్‌ఐ అభినందనలతో పాటు ప్రశంస పత్రాలను అందుకున్నారు. కరోనా ఓ సాధారణ జ్వరం దగ్గు, చలి వంటి రోగమన్నారు. వైద్యుల సలహాలను పాటిస్తే రోగాన్ని దూరం చేసి క్షేమంగా బయట పడే అవకాశం ఉందన్నారు. ప్రముఖ సీనీ డైరెక్టర్ రాజమౌళి, గాయకులు కీరవాణీ, నార్సింగి సీఐ గంగధర్, డిఐ బాల్‌రాజు, ఎస్‌ఐలు శ్రీధర్, రాములు, లక్ష్మణ్, బాల్‌రామ్‌లు అభినందించిన వారిలో ఉన్నారు.