Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిశుభ్రత వాహానాల ప్రారంభం
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
నగర శివారు మున్సిపల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మెన్, వైస్ చైర్మెన్లతో కలిసి తడి, పొడి, రోడ్లు, డ్రయినేజీ క్లినింగ్ నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్‌లోని మున్సిపాల్టిలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని తెలిపారు. మున్సిపాల్టీలను సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలకు నిత్యం సేవలను అందించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలున్న వేంటనే పరిష్కరించే దిశగా పని చేయాలన్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు నూతన యంత్ర వాహనాలను తీసుకొస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నార్సింగి చైర్‌పర్సన్ దార్గుపల్లి రేఖాయాదగిరి, వైస్ చైైర్మెన్ గొర్ల వెంకటేష్‌యాదవ్, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మేనేజన్ భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్స్ శివారెడ్డి, ప్రతి శ్రీకాంత్‌రావ్, ఉషారాణి, అరుణజ్యోతి, యాదమ్మ, విజేత, ప్రవీణ్‌కుమార్, పద్మ, నాగపూర్ణ, లక్ష్మీ ప్రవళిక, అధిత్యారెడ్డి, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా, మాజీ సర్పంచ్ మేకల ప్రవీణ్‌యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు ప్రశాంత్‌యాదవ్, కమలమ్మ, మమ్మద్, రయోసు, టీఆర్‌ఎస్ నాయకులు నాగరాజు, ఫారుక్‌బారు, ధయానంద్, స్వరూప్, హరిశంకర్, పొన్న రమేష్, నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.